Andhra Pradesh: ఇది చంద్రన్న శపథం.. శ్రీశైలం వెళ్లే భక్తులకు ఆ కష్టాలు తీరినట్టే..!

| Edited By: Jyothi Gadda

Nov 25, 2024 | 9:25 PM

కార్తీక మాసం కావడంతో వేలాదిగా భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వస్తున్నారని, అందువల్లే ట్రాఫిక్ పెరిగిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. శ్రీశైలం ప్రాశస్త్యం తో పాటు పెద్ద ఎత్తున దేవాలయాన్ని అభివృద్ధి చేసే మాస్టర్ ప్లాన్ ను ప్రభుత్వం చేస్తోందని, ఈ నేపద్యంలో

Andhra Pradesh: ఇది చంద్రన్న శపథం.. శ్రీశైలం వెళ్లే భక్తులకు ఆ కష్టాలు తీరినట్టే..!
Srisailam Mallanna
Follow us on

కార్తీక మాసం కావడంతో అన్నీ దారులు జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం వైపే మళ్ళాయి. దీంతో మల్లన్న దగ్గరకు చేరాలంటే ట్రాఫిక్ సమస్యలను అధిగమించడం గగనమైపోతోంది. దేశ వ్యాప్తంగా శ్రీశైలం వస్తున్న శివయ్య భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా సమస్యను పరిష్కరించేందుకు రంగంలోకి దిగారు. ఈ నేపద్యంలో అధికారులతో మాట్లాడిన సీఎం శ్రీశైలం-హైదరాబాద్ హైవే రద్దీ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యపై ఈరోజు అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి, శ్రీశైలం ఘాట్ రోడ్డుతో పాటు దేవాలయానికి వెళ్లే మార్గాల్లో రద్దీని చక్కదిద్దాలని సూచించారు.

రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్..

శ్రీశైలం ఘాట్ రోడ్ లో ఈ మధ్య కాలంలో రోజురోజుకూ వాహనాల రాకపోకలు పెరుగుతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను నివారించేందుకు శాశ్వత పరిష్కారానికి సమగ్ర అధ్యయనం చేపట్టాలని అధికారులకు నిర్దేశించారు ముఖ్యమంత్రి. కార్తీక మాసం కావడంతో వేలాదిగా భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వస్తున్నారని, అందువల్లే ట్రాఫిక్ పెరిగిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

ఇవి కూడా చదవండి

అవసరమైతే పక్క రాష్ట్రాలతో మాట్లాడండి .. సీఎం

శ్రీశైలం ప్రాశస్త్యం తో పాటు పెద్ద ఎత్తున దేవాలయాన్ని అభివృద్ధి చేసే మాస్టర్ ప్లాన్ ను ప్రభుత్వం చేస్తోందని, ఈ నేపద్యంలో రానున్న రోజుల్లో పెరిగే రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యను స్వయంగా పరిశీలించి, పరిష్కార మార్గానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆర్‌ అండ్‌ బీ, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను ఆదేశించారు. అవసరమైతే పొరుగు రాష్ట్ర అధికారులతో సమస్యపై చర్చించి, సమన్వయంతో భక్తుల ఇబ్బందులను తొలిగించాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..