Andhra Pradesh: వృత్తిరిత్యా ఉపాధ్యాయుడు.. చేసేవన్నీ పాడుపనులే.. చివరికి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు..

Andhra Pradesh: అతను వృత్తి పరంగా ఉపాధ్యాయుడు.. ప్రవృత్తిపరంగా పెద్ద స్మగ్లర్. అంతేకాదు.. వృత్తిని అడ్డుపెట్టుకుని అత్యాచారాలకూ పాల్పడిన చరిత్ర అతనిది. తాజాగా అతని దుర్మార్గపు పనులు రట్టు అయ్యాయి.

Andhra Pradesh: వృత్తిరిత్యా ఉపాధ్యాయుడు.. చేసేవన్నీ పాడుపనులే.. చివరికి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు..
రాష్ట్రవ్యాప్తంగా నకిలీనోట్ల కట్టలు గుట్టలుగా పట్టుబడుతున్నాయి. గతంలో దేశవ్యాప్తంగా సాగిన నకిలీ నోట్ల చలామణి ప్రస్తుతం తెలంగాణలో మళ్లీ పుంజుకున్నట్లుగా కనిపిస్తోంది. అడపా దడపా నకిలీగాళ్లు పడుతున్నారు.


Andhra Pradesh: అతను వృత్తి పరంగా ఉపాధ్యాయుడు.. ప్రవృత్తిపరంగా పెద్ద స్మగ్లర్. అంతేకాదు.. వృత్తిని అడ్డుపెట్టుకుని అత్యాచారాలకూ పాల్పడిన చరిత్ర అతనిది. తాజాగా అతని దుర్మార్గపు పనులు రట్టు అయ్యాయి. చిత్తూరు పోలీసులు పక్కా పథకం ప్రకారం దాడి చేసి అతని స్థావరాన్ని రట్టు చేశారు. తాజాగా చిత్తూరు జిల్లా పోలీసులు మద్యం డంప్‌పై మెరుపు దాడి చేశారు. చెన్నై, బెంగళూరు జాతీయ రహదారుల మధ్యలో రెడ్డిగుంట జంక్షన్ వద్ద రహస్యంగా దాచి ఉంచిన మద్యం డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఇద్దరు లిక్కర్ స్మగ్లర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. మరో స్మగ్లర్ తప్పించుకోగా.. అతని కోసం గాలిస్తున్నారు.

వివరాల్లోకెళితే.. చెన్నై, బెంగళూరు జాతీయ రహదారుల మధ్యలో రెడ్డిగుంట జంక్షన్ వద్ద రహస్యంగా దాచి ఉంచిన మద్యం డంప్‌ పై చిత్తూరు పోలీసులు మెరుపు దాడి చేశారు. చెన్నై బెంగళూరు జాతీయ రహదారి వెంట, చిత్తూరు శివారు ప్రాంతంలో గల లక్ష్మయ్య కండ్రి గ్రామంలలో డంప్ ను గుర్తించారు. ఈ దాడులలో 21 లక్షల రూపాయల విలువ గల 680 మద్యం బాటిల్లతో పాటు రెండు కార్లను కూడ పోలీసులు సీజ్ చేసారు. ఈ వ్యవహారంలో సోమల మండలానికి చెందిన చంద్రమౌళి, గంగాధర నెల్లూరు మండలానికి చెందిన తులసీరామ్ ని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

అయితే, ఇందులో ప్రధాన నిందితుడు చంద్రమౌళి. ఇతనపై గంగవరం, సోమల మండలాల్లో పలు కేసులు ఉన్నాయి. ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న చంద్రమౌళిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. చంద్రమౌళి అత్యాచారాలు, చీటింగ్ లకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక మరో నిందితుడు బైరెడ్డిపల్లి కి చెందిన పురుషోత్తం పరారయ్యాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఈ కేసుకు సంబంధించిన వివరాలను చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.

Also read:

Andhra Pradesh: వైసీపీ నేతలకు భూమా బ్రహ్మానందరెడ్డి స్వీట్ వార్నింగ్.. ఏ విషయంలోనంటే..

Adilabad: అక్కడ ఎటు చూసిన పులుల ఆనవాళ్లే.. ఆనందంలో అధికారులు.. ఆందోళనలో రైతులు, పశువుల కాపరులు..

Andhra Pradesh: లారీ డ్రైవర్‌కు షాక్‌.. కళ్లముందే లక్షలు దోచుకెళ్లారు.. అసలు ట్విస్ట్ అప్పుడే మొదలైంది..

Click on your DTH Provider to Add TV9 Telugu