AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: ఛీ..ఛీ వీడేం భర్త.. డబ్బు కోసం భార్యతో ఆ పని చేయించాడు..

చిత్తూరు జిల్లా కొత్తకండ్రిగకు చెందిన ఓ వివాహిత భర్త వేధింపులను మీడియా ముందు చెప్పుకుని బావురుమంది. కరోనాకాలం నుంచి భర్త సుబ్రహ్మణ్యం రెడ్డి తనపై అసహజమైన ఒత్తిళ్లు తెచ్చాడని, ఓ యాప్‌లో అడల్ట్ కాల్స్ చేయించాడని ఆరోపిస్తుంది. కష్టం చెప్పుకుందామని పోలీస్ స్టేషన్‌కు వెళ్తే.. అక్కడి కానిస్టేబుల్ నుంచి కూడా వేధింపులు వచ్చినట్లు తెలిపింది.

Andhra News:  ఛీ..ఛీ వీడేం భర్త.. డబ్బు కోసం భార్యతో ఆ పని చేయించాడు..
Women (Representative image)
Raju M P R
| Edited By: Ram Naramaneni|

Updated on: Feb 16, 2025 | 1:59 PM

Share

తిరుపతి జిల్లాలో తాళి కట్టన భర్తే నీచమైన పనిచేయాలని ఆ ఇల్లాలిపై ఒత్తిడి తెచ్చాడు. ఆర్థిక అవసరాలు తీరాక కూడా అదే పని కంటిన్యూ చేయమన్నాడు. కాదన్నందుకు ఇంటి నుంచి గెంటేసాడు. భర్త వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయిస్తే అక్కడ అదే టార్చర్. కోరిక తీర్చమని కానిస్టేబుల్ వేధింపులు ఎదురయ్యాయి. దీంతో ఏం చేయాలో తెలియక మీడియా ముందుకు వచ్చింది రామచంద్రపురం మండలానికి చెందిన మహిళ.

రామచంద్రాపురం మండలం కొత్త కండ్రిగకు చెందిన వివాహత.. తన భర్త సుబ్రహ్మణ్యం వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తోంది. కరోనా సమయంలో యాప్‌లో న్యూడ్ కాల్స్ మాట్లాడాలని భర్త సుబ్రహ్మణ్యం ఒత్తిడి చేసి వేధించాడని ఆవేదన వ్యక్తం చేసింది. చామెట్ యాప్‌లో భర్త సుబ్రహ్మణ్య రెడ్డి ఐడీ క్రేట్ చేసి భార్యను రొంపిలోకి దింపాడు. ఆర్థిక అవసరాల నుంచి గట్టేందుకు ఒత్తిడి చేయడంతో.. ఆమె ఏం చేయలేకపోయింది. అలా భార్య సాయంతో రెండున్నరేళ్లలో రూ 18 లక్షలు నగదు సంపాదించాడు సుబ్రహ్మణ్యం. ఆ డబ్బులో అప్పులు తీర్చి నగలు కూడా కొన్నారు.

దీంతో ఇక ఈ పని వదిలేద్దాం అనుకుంది భార్య. అయితే  ఈజీ మనీకి మరిగిన భర్త సుబ్రహ్మణ్యం మాత్రం ఇందుకు ససేమిరా అన్నాడు. దీంతో భార్యతో తరచు గొడవపడి వేధింపులకు గురిచేశాడు. తాను చెప్పిన పని చేయకపోవడంతో ఆమె వద్ద ఉన్న నగదు, బంగారు ఆభరణాలు తీసుకుని.. ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. పిల్లల్ని కూడా చూపకుండా ఇంటికి దూరం చేశాడు. భార్య అడల్ట్ వీడియో కాల్ వీడియో వైరల్ కావడం కూడా సుబ్రహ్మణ్యంకు కలిసి వచ్చే అంశమైంది. పిల్లలకు, గ్రామానికి దూరంగా ఉన్న శ్రీదేవి… భర్త అరాచకంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే అక్కడ కూడా వేధింపులు తప్పని పరిస్థితి ఎదురైంది.

రామచంద్రాపురం పీఎస్‌లో భర్త సుబ్రహ్మణ్యంపై ఫిర్యాదు చేస్తే అక్కడ ఉన్న కానిస్టేబుల్ లైంగికంగా వేధించాడు. తనతో అడ్జస్ట్ కావాలని ఒత్తిడి చేస్తున్నాడని మీడియా ముందుకు వచ్చిన ఆ వివాహిత బోరుమంది.  అసభ్యకర మెసేజులతో ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించింది. ఒకవైపు భర్త వేధింపులు, మరోవైపు న్యాయం చేయాల్సిన కానిస్టేబుల్ నిర్వాకంతో బాధితురాలు కన్నీరు మున్నీరు అవుతుంది. న్యాయం చేయమని అధికారులను వేడుకుంటోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..