Chandrababu: ఏపీ ప్రజలు మార్పుకు సిద్దంగా ఉన్నారు’: చంద్రబాబు
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీపెరంబదూర్లోని శ్రీరామానుజార్ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. సమానత్వం కోసం పాటుపడిన శ్రీరామానుజుల వారి జన్మస్థలానికి రావడం తన అదృష్టం అని చంద్రబాబు అన్నారు. అందరికీ మంచి జరగాలని తాను ప్రార్ధించినట్లు తెలిపారు. తమిళనాడులో తనకు లభించిన ఘన స్వాగతంపై చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు.
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీపెరంబదూర్లోని శ్రీరామానుజార్ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. సమానత్వం కోసం పాటుపడిన శ్రీరామానుజుల వారి జన్మస్థలానికి రావడం తన అదృష్టం అని చంద్రబాబు అన్నారు. అందరికీ మంచి జరగాలని తాను ప్రార్ధించినట్లు తెలిపారు. తమిళనాడులో తనకు లభించిన ఘన స్వాగతంపై చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. తాను కష్టంలో ఉన్న సమయంలో ప్రజలు ఇచ్చిన మద్దతు మరిచిపోలేనని తెలిపారు. ధర్మాన్ని రక్షించుకునేందుకు..తెలుగు జాతి కోసం ముందుండి పనిచేస్తాను అని చంద్రబాబు అన్నారు. ఎపి ప్రజలు మార్పు తేవాలనే విషయంలో స్పష్టతతో ఉన్నారని, 5ఏళ్ల పాటు రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవాలంటే సమర్థవంతమైన నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. అందరి సహకారంతో రాష్ట్రాన్ని కాపాడుకుంటామని చెప్పుకొచ్చారు. చెన్నై విమానాశ్రయం వద్ద స్థానిక ప్రజలు, అభిమానులు చంద్రబాబు నాయుడుకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
ఇదిలా ఉంటే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ అయి బెయిల్ మీద బయటకు వచ్చిన చంద్రబాబు ముందుగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తరవాత విజయవాడ కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లించుకున్న విషయం మనకు తెలిసిందే. ఆ తరువాత సింహాచలం అప్పన్న, శ్రీశైలం మల్లిఖార్జున స్వామి దర్శనాన్ని చేసుకున్నారు. ఇలా నెల మొత్తం ఆధ్యాత్మిక భావనతో పర్యటనలు చేస్తూ కుటుంబంతో గడుపుతున్నారు. ఇదిలా ఉంటే మన్నటి వరకూ రాజకీయాలు మాట్లాడను అని చెప్పిన బాబు చెన్నై పర్యటనతో రాజకీయంగా మాటల అస్త్రాలు ఎక్కుపెట్టేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. మరి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..