AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది కదా అద్దిరిపోయే గుడ్ న్యూస్ అంటే.. ఇకపై అయ్యప్ప భక్తులు శబరిమల వెళ్లాలంటే..

అయ్యప్ప భక్తులకు కేంద్ర విమానయాన సంస్థ గుడ్ న్యూస్ అందించింది. మకర జ్యోతి వరకు ఈ సదుపాయం ఉంటుందని పేర్కొంది. ఇకపై బస్సులు, ప్రైవేటు వాహనాల్లో వెళ్లాల్సిన పనిలేకుండా.. డైరెక్ట్ విమానంలోనే..

ఇది కదా అద్దిరిపోయే గుడ్ న్యూస్ అంటే.. ఇకపై అయ్యప్ప భక్తులు శబరిమల వెళ్లాలంటే..
Airport
S Srinivasa Rao
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 26, 2024 | 8:55 PM

Share

ఏటా ఎన్నో కఠిన నియమ, నిష్టల మధ్య అయ్యప్ప దీక్షలు చేపట్టే లక్షలాది మంది భక్తులకు కేంద్ర పౌర విమానయాన శాఖ శుభవార్త తెలిపింది. ఎంతో పవిత్రంగా భావించే పవిత్ర ఇరుముడితో నేరుగా విమాన క్యాబిన్‌లోనే ప్రయాణం చేయవచ్చని వెల్లడించింది. భక్తుల వినతులను దృష్టిలో పెట్టుకుని నిబంధనలు సడలించామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. దీనికి అనుగుణంగా బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డీజీ ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలిపారు. ఈ మేరకు శ్రీకాకుళం క్యాంపు కార్యాలయం నుంచి ఆయన ఈ ప్రకటన విడుదల చేశారు.

భద్రతా కారణాల రీత్యా విమానాల్లోకి కొబ్బరికాయతో కూడిన ఇరుముడిని ఇన్నాళ్లూ అనుమతించడం లేదు. దీంతో అయ్యప్ప భక్తులు శబరిమల వెళ్ళటానికి రైళ్లు, బస్సులు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చేది. అయితే ఇపుడు విమానయాన శాఖ తీసుకున్న తాజా నిర్ణయం చాలామంది అయ్యప్ప భక్తులకు చక్కని ఉపశమనం కలిగిస్తుంది.

మకర జ్యోతి వరకు అవకాశం..

మండల దీక్ష చేపట్టే అయ్యప్ప భక్తులకు ఇరుముడి ఎంతో ప్రత్యేకమైనది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఇన్నాళ్లూ లక్షలాది మంది భక్తులు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. తాజా ఉత్తర్వులతో ఎయిర్ పోర్ట్ సిబ్బంది స్కానింగ్ చేసిన తరువాత.. ఇరుముడితో నేరుగా విమాన క్యాబిన్‌లోనే ప్రయాణం చేయవచ్చని తెలిపారు. వెంటనే అమల్లోకి వచ్చే ఈ సౌలభ్యం.. మకర జ్యోతి దర్శనం ముగిసి, జనవరి 20 వరకు భక్తులకు అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. అయ్యప్ప భక్తులంతా దీనిని గమనించి, తనిఖీ సమయంలో సిబ్బందికి సహకరించాలని కోరారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: పటాస్ మూవీలో ఈ చిన్నది గుర్తుందా.? ఇప్పుడు అందంతో మత్తెక్కిస్తోందిగా

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..