Andhra Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. కారు-లారీ ఢీ.. ఆరుగురు ఇస్కాన్ ప్రతినిధులు మృతి!

అనంతపురం ఇస్కాన్ టెంపుల్ కి చెందిన ప్రతినిధులు తాడిపత్రిలోని ఓ ప్రైవేటు స్కూల్లో కార్యక్రమానికి వెళ్లి వెస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Andhra Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. కారు-లారీ ఢీ.. ఆరుగురు ఇస్కాన్ ప్రతినిధులు మృతి!
Ananthapur Road Accident
Follow us
Nalluri Naresh

| Edited By: Balaraju Goud

Updated on: Oct 26, 2024 | 8:07 PM

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సింగనమల మండలం నాయన పల్లి క్రాస్ వద్ద కారు లారీ ఢీకొని ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతపురం వైపు నుంచి తాడిపత్రి వెళ్తున్న లారీ.. తాడిపత్రి వైపు నుంచి అనంతపురం వస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. దీంతో స్పాట్‌లోనే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

అనంతపురం తాడిపత్రి రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండగా.. వన్ వే లో వెళ్తున్న కారు – లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అనంతపురం ఇస్కాన్ టెంపుల్‌కు చెందిన ప్రతినిధులు ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కారు వేగంగా వచ్చి లారీని ఢీకొనడంతో.. లారీ కిందకు కారు ఇరుక్కుపోయింది. వెంటనే స్థానికులు కారులో ఉన్న మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అనంతపురం ఇస్కాన్ టెంపుల్ కి చెందిన ప్రతినిధులు తాడిపత్రిలోని ఓ ప్రైవేటు స్కూల్లో శ్రీరామ.. శ్రీకృష్ణ సంకీర్తన, భజన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీ కింద ఇరుక్కుపోయిన కారును బయటికి తీసి.. మృతదేహాలను అంబులెన్సులో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్