CM Chandrababu: క్వార్టర్ 99 దాటితే తిరగబడరా సామీ..! ఇకపై ఆ దందాలను సహించం.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇసుక, మద్యం అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రకటించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర తప్ప మద్యంను అధిక ధరకు విక్రయించినా.. అక్రమంగా ఇసుక దందా చేసినా.. అలాంటి వారిపై ప్రజలు తిరగబడాలని పిలుపునిచ్చారు. టీడీపీ శ్రేణులు ఈ అక్రమాలలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.

CM Chandrababu: క్వార్టర్ 99 దాటితే తిరగబడరా సామీ..! ఇకపై ఆ దందాలను సహించం.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
CM Chandrababu
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 27, 2024 | 8:04 AM

ప్రజల చేతికే పవర్‌. తిరగబడరా సామీ అనే రేంజ్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చారు.. ఇసుక అక్రమ దందా చేసినా.. మద్యం అధిక ధరకు విక్రయించినా తిరగబడాలని ప్రజలకు పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి. అంతేకాదు.. ఇసుక మద్యం దందాల్లో జోక్యం చేసుకోవద్దని టీడీపీ శ్రేణులకూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.. మంగళగిరిలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పలు విషయాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.. ఎవరూ ఇసుక వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని క్లియర్‌ కట్‌ ఇన్‌స్ట్రక్షన్‌ ఇచ్చారు. ఇసుక అక్రమ దందా చేసేవాళ్లపై తిరుగుబాట చేయాలని ప్రజలకు పిలుపినిచ్చారు.. ఇక బాటా తరహాలో ఏపీలో మద్యం రేటు రూ 99కి ఫిక్స్డ్‌. అంతకు మించి ఒక్క పైసా వసూల్‌ చేసినా కఠినచర్యలు తప్పవని స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఎమ్మార్పీపీకి కన్నా ఒక్కపైసా కూడా ఇవ్వొద్దని మందుబాబులకు సూచించారు.

మద్యం, ఇసుక అక్రమాలను కట్టడి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు సీఎం చంద్రబాబు . ఏమాత్రం అవినీతికి తావులేకుండా పకడ్బందీ పాలసీలను అమలు చేస్తామన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలునిచ్చిన చంద్రబాబు.. టీడీపీ సభ్యత్వం సమాజంలో ఓ గుర్తింపులాంటిదన్నారు. పనితీరుతోనే 2029లో అధికారంలోకి వస్తామన్నారు.

మద్యం ధర విషయంలో 99 లక్ష్మణ రేఖ దాటినా.. ఇసుక అక్రమ దందా చేసినా … ఇక దారి అత్తారింటికే. వాళ్లు వీళ్లు అనే తేడా లేదు.. ఎవరు గీత దాటినా చర్యలు ఇక మాములుగా ఉండవంటూ వార్నింగ్ ఇచ్చారు.

కాగా.. శనివారం సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. తొలి సభ్యత్వాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు చేతులమీదుగా చంద్రబాబు అందుకున్నారు..టీడీపీ సభ్యత్వం ఇవ్వడంతో పాటు శిక్షణ కూడా ఇస్తామని.. రాజకీయ చైతన్యం నింపుతున్నామంటూ చంద్రబాబు పేర్కొన్నారు. కార్యకర్తలను నాయకులుగా తయారుచేస్తున్న పార్టీ టీడీపీ అంటూ తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..