అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ఇక విమానంలో ఇరుముడికి నో కండిషన్స్.. కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు కీలక ప్రకటన..

విశాఖపట్నం - విజయవాడ మధ్య రెండు కొత్త విమాన సేవలు ప్రారంభమయ్యాయి.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ సేవలను విశాఖపట్నంలో ప్రారంభించారు. ముఖ్యంగా అయ్యప్ప భక్తులకు శుభవార్తని అందించారు. ఇరుముడిని విమానంలో తీసుకెళ్ళడానికి అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. జనవరి 20 వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు.

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ఇక విమానంలో ఇరుముడికి నో కండిషన్స్.. కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు కీలక ప్రకటన..
Kinjarapu Rammohan Naidu
Follow us

|

Updated on: Oct 27, 2024 | 11:20 AM

విశాఖ- విజయవాడ మధ్య మరోరెండు కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. విశాఖ విమానాశ్రయంలో ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు ప్రారంభించారు. కొత్త సర్వీసులతో విశాఖ- విజయవాడ మధ్య తిరిగే సర్వీసులు మూడుకు చేరింది. ఈ కార్యక్రమంలో ఎంపీ గొల్ల బాబురావు, ఎమ్మెల్యే గణబాబు హాజరయ్యారు. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సర్వీసు ఉదయం 9:35 గంటలకు విశాఖలో బయలుదేరి 10:35కు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటోంది. తిరిగి రాత్రి 7:55కు విజయవాడలో బయలుదేరి 9 గంటలకు విశాఖ వెళ్తుంది. ఇండిగో సర్వీసు రాత్రి 7:15కు విజయవాడలో బయలుదేరి 8:20కి విశాఖ చేరుతుంది. అదే సర్వీసు తిరిగి రాత్రి 8:45కు విశాఖలో బయలుదేరి 9:50కి విజయవాడ చేరుతుంది.

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్..

విశాఖ-విజయవాడ మధ్య మరో రెండు విమాన సర్వీసులు ప్రారంభించిన అనంతరం కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మరిన్ని సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇరుముడితో విమానంలో ప్రయాణించేందుకు అనుమతినిస్తున్నట్లు తెలిపారు. జనవరి 20 వరకు అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 20 వరకు ఈ నిబంధన ఉంటుదన్నారు. ఇప్పటి వరకూ భద్రతా కారణాల రీత్యా ఇరుముడిని వెంట తీసుకెళ్లనివ్వలేదు అధికారులు.. ఇరుముడిని చెకిన్‌ బ్యాగేజీలో కాకుండా తమ వెంట తీసుకెళ్లవచ్చంటూ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు శుభవార్త చెప్పారు.

వీడియో చూడండి..