Andhra pradesh: ఎన్నిక‌ల వేళ అధికారుల‌పై బ‌దిలీ వేటు వేసిన సీఈసీ.. కారణమేంటంటే..

గుంటూరు రేంజ్ ఐజీ పాల‌రాజు తో పాటు ప్రకాశం,ప‌ల్నాడు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల ఎస్పీలను వెంటనే బదిలీ చేయాలని రాష్ట ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ముకేష్ కుమార్ మీనాకు లేఖ పంపింది..ఈ లేఖ‌ను సీఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డికి..

Andhra pradesh: ఎన్నిక‌ల వేళ అధికారుల‌పై బ‌దిలీ వేటు వేసిన సీఈసీ.. కారణమేంటంటే..
Ap News
Follow us

| Edited By: Narender Vaitla

Updated on: Apr 02, 2024 | 6:52 PM

రాష్ట్రంలో ప‌లు జిల్లాల క‌లెక్ట‌ర్లు,ఎస్పీల‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం బ‌దిలీ వేటు వేసింది…ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్న స‌మ‌యంలో జ‌రిగిన ప‌లు ఘ‌ట‌న‌లు,ప్ర‌తిప‌క్షాల నుంచి వ‌చ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది…ఆయా అధికారుల స్థానంలో కొత్త వారి నియామ‌కం కోసం ప్యానెల్ పంపించాల‌ని ఆదేశించింది.ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ కీల‌క ఆదేశాలు జారీ చేసింది.ఐదుగురు ఐపీఎస్,ముగ్గురు ఐఏఎస్ అధికారుల‌పై బ‌దిలీ వేటు వేసింది.

గుంటూరు రేంజ్ ఐజీ పాల‌రాజు తో పాటు ప్రకాశం,ప‌ల్నాడు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల ఎస్పీలను వెంటనే బదిలీ చేయాలని రాష్ట ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ముకేష్ కుమార్ మీనాకు లేఖ పంపింది..ఈ లేఖ‌ను సీఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డికి కూడా సీఈసీ పంపించింది…ప్ర‌కాశం జిల్లా ఎస్పీ ప‌ర‌మేశ్వ‌ర‌రెడ్డి,ప‌ల్నాడు జిల్లా ఎస్పీ ర‌విశంక‌ర్ రెడ్డి,చిత్తూరు జిల్లా ఎస్పీ జాషువా,అనంత‌పురం జిల్లా ఎస్పీ అన్బురాజ‌న్,నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమ‌లేశ్వ‌ర్ ల‌ను ఎన్నిక‌లు ముగిసే వ‌ర‌కూ ఆయా బాధ్య‌త‌ల నుంచి తొల‌గించాల‌ని పేర్కొంది…వీరి స్థానంలో ఒక్కో పోస్టుకు ముగ్గురు అధికారుల ప్యాన‌ల్ ను వెంట‌నే పంపించాల‌ని సీఈసీ సూచించింది.

అధికారుల బ‌దిలీ వెనుక కార‌ణాలు ఇవేనా…?

ఒక ఐజీ తో పాటు ఐదు జిల్లాల ఎస్పీల‌ను బ‌దిలీ చేసింది కేంద్ర ఎన్నిక‌ల సంఘం…ఇక‌ మూడు జిల్లాల ఎన్నిక‌ల అధికారులుగా ఉన్న క‌లెక్ట‌ర్ల‌పైనా బ‌దిలీ వేటు ప‌డింది..కృష్ణా,అనంత‌పురం,తిరుప‌తి జిల్లా క‌లెక్ట‌ర్లు రాజ‌బాబు,ఎం.గౌత‌మి,ల‌క్ష్మీషాపైనా వేటు ప‌డింది.మార్చి 17న చిల‌క‌లూరిపేట ప్ర‌ధాని స‌భ‌లో భ‌ద్ర‌తా వైఫ‌ల్యంపై ప్ర‌తిప‌క్షాలు ఇచ్చిన ఫిర్యాదుతో పాటు సీఈఓ ఇచ్చిన నివేదిక ఆధారంగా గుంటూరు రేంజ్ ఐజీ పాల‌రాజ్,ప‌ల్నాడు ఎస్పీ ప‌ర‌మేశ్వ‌ర‌రెడ్డిపై బ‌దిలీ వేటు వేసిన‌ట్లు స‌మాచారం.ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన వెంట‌నే ప్ర‌కాశం జిల్లాలో ఓ పార్టీ కార్య‌క‌ర్త హ‌త్య జ‌రిగింది..ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌కాశం జిల్లా ఎస్పీ ప‌ర‌మేశ్వ‌ర‌రెడ్డిని స్వ‌యంగా పిలిచి వివ‌ర‌ణ కోరారు ఈసీ మీనా.

ఆ తర్వాత సీఈసీకి నివేదిక పంపించారు..ఈ కార‌ణంగానే ఆయ‌న‌పై బ‌దిలీ వేటు ప‌డిన‌ట్లు తెలుస్తోంది..అధికార పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు చిత్తూరు,అనంత‌పురం,నెల్లూరు జిల్లాల ఎస్పీల‌ను బ‌దిలీ చేసిన‌ట్లు స‌మాచారం.ఇక క‌లెక్ట‌ర్ల విష‌యంలో కూడా ప్ర‌తిప‌క్షాల నుంచి వ‌చ్చిన ఫిర్యాదుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న‌ట్లు ఈసీ వ‌ర్గాలు చెబుతున్నాయి.తిరుప‌తిలో పెద్ద ఎత్తున దొంగ ఓట్ల న‌మోదుకు సంబంధించి ఫిర్యాదు చేసినా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీషా ప‌ట్టించుకోలేద‌ని ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది,,దీనిపై విచార‌ణ జ‌రిపిన త‌ర్వాత ల‌క్ష్మీషాపై బ‌దిలీ వేటు వేసిన‌ట్లు తెలిసింది.ఇక కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్ రాజ‌బాబు సైతం ఎన్నికల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న విధుల్లో నిర్ల‌క్ష్యంగా ఉన్నారంటూ సీఈఓకు అందిన ఫిర్యాదుల‌తో వేటు ప‌డిన‌ట్లు స‌మాచారం.మొత్తానికి ఒకేసారి ఇంత‌మంది అధికారుల‌ను బ‌దిలీ చేయ‌డం రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారి తీసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
Horoscope Today: ఆ రాశి వారికి ఆర్థికంగా ఓ శుభపరిణామం జరుగుతుంది.
Horoscope Today: ఆ రాశి వారికి ఆర్థికంగా ఓ శుభపరిణామం జరుగుతుంది.
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..