AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLC Ananta Babu: హత్య జరిగిన రోజు అపార్ట్‌మెంట్‌లో ఇదే జరిగింది.. కీలక విషయాలు చెప్పిన వాచ్‌మెన్‌..

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగిన రోజు ఎమ్మెల్సీ అనంతబాబు చాలా హాడావుడిగా కనిపించారు. కారులో తన అపార్ట్‌మెంట్‌కి వెళ్లారు. ఆయనతో పాటు గన్‌మెన్లతో పాటు అనుచరులు కూడా ఉన్నారు. తన ఫ్లాట్‌కి హడావుడిగా వెళ్లి మళ్లీ తిరిగి వెళ్లి పోయారు. ఇవన్నీ సీసీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి.

MLC Ananta Babu: హత్య జరిగిన రోజు అపార్ట్‌మెంట్‌లో ఇదే జరిగింది.. కీలక విషయాలు చెప్పిన వాచ్‌మెన్‌..
Mlc Ananta Babu
Sanjay Kasula
|

Updated on: May 24, 2022 | 1:27 PM

Share

నా ఇగో హర్ట్ అయింది.. అందుకే సుబ్రహ్మణ్యంను(Subramaniam)చంపేశా.. పోలీసులకు ఎమ్మెల్సీ అనంతబాబు(Ananta Babu) ఇచ్చిన వివరణ ఇది. నాలుగు రోజుల తర్వాత అఙ్ఞాతం వీడి ఒక ప్రజా ప్రతినిధి ఇచ్చిన సమాధానం అందర్నీ షాక్‌కి గురిచేస్తోంది. ఎమ్మెల్సీపై హత్య కేసుకట్టి, రిమాండ్‌ చేశారు. ఆ తర్వాత పోలీసులు చేసిన ప్రకటన ఇలా ఉంది.  తప్పు జరిగింది.. ప్రాణంపోయింది.. అనుకోకుండా. కానీ ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు తప్పు మీద తప్పు చేయాల్సి వచ్చిందట.. అంతేకానీ పాపం వాంటెడ్లీ…స్కెచ్ వేసి కావాలని మాత్రం చంపలేదట. పోలీసులే చెప్పారు.. పోలీసులకు అనంతబాబే స్వయంగా స్టేట్‌మెంట్ ఇచ్చారు. పాపం తన మాజీ డ్రైవర్ చనిపోయేముందు కూడా మంచినీళ్లు ఇచ్చారట.. అయినా ప్రాణాలు కాపాడలేకపోయారట. ఇదంతా సోమవారం రోజు జరిగిన అనంత బాబు ఎప్సోడ్‌లో డ్రామా. సుబ్రహ్మణ్యంను చంపేసింది అనంతబాబేనని బాధిత కుటుంబం మొదటి నుంచి గుండెలు బాదుకుంది. అరెస్ట్ చేయాలని నినదించింది.

హత్య జరిగిన రోజు ఏం జరిగిందంటే..

అయితే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగిన రోజు ఎమ్మెల్సీ అనంతబాబు చాలా హాడావుడిగా కనిపించారు. కారులో తన అపార్ట్‌మెంట్‌కి వెళ్లారు. ఆయనతో పాటు గన్‌మెన్లతో పాటు అనుచరులు కూడా ఉన్నారు. తన ఫ్లాట్‌కి హడావుడిగా వెళ్లి మళ్లీ తిరిగి వెళ్లి పోయారు. ఇవన్నీ సీసీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. శ్రీరామ్‌నగర్‌ కొండయపాలెంలోని శంకర్‌అపార్ట్‌ మెంట్‌లో ఎమ్మెల్సీ నివాసం ఉంటున్నారు. అర్ధరాత్రి 1 గంట దాటాక కారులో ఇంటికి వెళ్లారాయన. ఆయనతో పాటు గన్‌మెన్లు కూడా ఉన్నారు. అయితే అప్పటికే కారులో డెడ్‌బాడీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎపిసోడ్‌పై కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

అనంతబాబు అలియాస్‌ ఏజెన్సీ వీరప్పన్‌..

అనంతబాబు అలియాస్‌ ఏజెన్సీ వీరప్పన్‌. మన్యం ఇలాఖాలో ఆయన ఆడిందే ఆట పాడిందే పాట. ఆయన మాటే శాసనం అన్న టాక్‌ ఉంది. ప్రశ్నించాడన్న పాపానికి సుబ్రహ్మణ్యంను పొట్టనబెట్టుకున్నాడు. మరిప్పుడు ఆయన ఎమ్మెల్సీ పదవిపై ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది? పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తారా? వివరణ కోరి సరిపెడతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..