Public Exams 2025: టెన్త్‌ విద్యార్ధుల కోడి తెలివితేటలు.. కాపీ కొట్టేందుకు ఎంతకు తెగించారో తెలిస్తే షాక్‌!

| Edited By: Srilakshmi C

Mar 23, 2025 | 11:19 AM

రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే పదోతరగతి పరీక్షలలో కాపీ కొట్టేందుకు కుదరటం లేదని ఏకంగా ఓ పరీక్ష కేంద్రoలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అయితే ఇది విద్యార్ధులు చేశారా? లేదా ఎవరు చేశారో..? తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు..

Public Exams 2025: టెన్త్‌ విద్యార్ధుల కోడి తెలివితేటలు.. కాపీ కొట్టేందుకు ఎంతకు తెగించారో తెలిస్తే షాక్‌!
CCTV cameras destroyed at SSC exam centre
Follow us on

పైడిభీమవరం, మార్చి 23: పదోతరగతి పరీక్షలలో కాపీ కొట్టేందుకు కుదరటం లేదని పరీక్ష కేంద్రoలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ధ్వంసం చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో తరగతి గదులలో ఎనిమిది గదులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆ కెమెరాలను ధ్వంసం చేశారు. ఈ విషయమై ఉపాధ్యాయులు చుట్టూ పక్కల ఆరా తీసినా.. సీసీ కెమెరాలు ఎవరు పగలు గొట్టరాన్నది తెలియరాలేదు.

ఈనెల 19 వ తేదీన పరీక్ష ముగిసాక సిబ్బంది,అధికారులు ఆన్సర్ షీట్స్ ను బండిల్స్ కడుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు స్కూల్ లో ఏర్పాటు చేసిన 8 సీసీ కెమేరాలను ధ్వంసం చేసి ఎస్కేప్ అయ్యారు. ఆరా తీసిన ఎటువంటి ఫలితం లేకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎగ్జామినేషన్ చీఫ్ సూపరింటెండెంట్ జగన్నాథరావు జె.ఆర్ పురం పీఎస్ లో ఫిర్యాదు చేశారు.

పైడిభీమవరం హైస్కూల్ లో 10వ తరగతి పరీక్షలలో సీసీ కెమెరాలు వలన చూసిరాతకు కుదరటం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు గాని, ఆకతాయిలు గాని ఈ పని చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కెమెరాలు ద్వoసం చేసే సమయంలో తమ ఫేస్ లు వాటిల్లో రికార్డు కాకుండా ముందు జాగ్రతలు తీసుకున్నారు. ముందుగా కెమెరాలకు ఉన్న పవర్ కనక్షన్ ప్లగ్ లను తీసేసి అనంతరం దర్జాగా వాటి ముందుకు వెళ్ళి ద్వoసం చేసేసారు. విషయం అధికారులకు తెలియటంతో మళ్ళీ వాటి స్థానంలో కొత్త సీసీ కెమెరాలను ఏర్పాటు చేసారు. ఈ మేరకు చీఫ్ సుపరెంటెండ్ జగన్నాథరావు, DEO డాక్టర్ కృష్ణ చైతన్య చర్యలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.