APSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు అదిరిపోయే బహుమతులు.. ఆ డిపో పరిధిలోని బస్సుల్లో జర్నీ చేస్తే..

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఆర్టీసీ డిపోలో పల్లె వెలుగు బస్సులలో ప్రయాణించే ప్రయాణికులకు బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు. ఈమేరకు జిల్లాలో నాలుగు డిపోల నుండి అమలాపురం నుండి వెళ్లే ఆర్టీసీ బస్సులలో గిఫ్ట్స్ బాక్స్ ఏర్పాటు చేశారు.

APSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు అదిరిపోయే బహుమతులు.. ఆ డిపో పరిధిలోని బస్సుల్లో జర్నీ చేస్తే..
Amalapuram Depot
Follow us
Basha Shek

|

Updated on: Oct 21, 2022 | 3:06 PM

ఒకప్పుడు ఆర్టీసీ ప్రయాణం సురక్షితం సుఖాంతం అని ప్రచారం చేసేవారు. ఇప్పుడు ఆర్టీసీలో ప్రయాణం చేయండి బహుమతులు పొందండి అంటూ ప్రచారం చేస్తున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఏపీఎస్ఆర్టీసీ అధికారులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఆర్టీసీ డిపోలో పల్లె వెలుగు బస్సులలో ప్రయాణించే ప్రయాణికులకు బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు. ఈమేరకు జిల్లాలో నాలుగు డిపోల నుండి అమలాపురం నుండి వెళ్లే ఆర్టీసీ బస్సులలో గిఫ్ట్స్ బాక్స్ ఏర్పాటు చేశారు. ప్రయాణికులు బస్సు దిగే ముందు తమ టికెట్‌పై పేరు, ఫోన్‌ నంబర్‌ తదితర వివరాలు చేసి బస్సులో ఏర్పాటు చేసిన గిఫ్ట్ బాక్స్ లో ఆ టికెట్ ను బాక్స్ లో వేయాలని, లక్కీ డిప్‌ ద్వారా విజేతలను ఎంపిక చేస్తామని మేనేజర్‌ తెలిపారు. ఆర్టీసీ అమలు చేస్తోన్న ఈ అవకాశాలను ప్రయాణికులు వినియోగించుకోవాలని నాగేశ్వరరావు తెలిపారు. ప్రతి ఒక్కరు తమ టికెట్ పై ఫోన్ నెంబర్ వేసి బాక్స్ లో వేసి వెళ్లాలని సూచిస్తున్నారు.అంతేకాదు ఇలా ఉపయోగించుకోవాలో ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు స్వయంగా అమలాపురం డిపో మేనేజర్ బస్సు ఎక్కి ప్రయాణికులకు వివరించారు.

కాగా ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెంచడమే లక్ష్యంగా ఏపీఎస్‌ఆర్టీసీ సరికొత్త స్కీమ్‌లను అందుబాటులోకి తెస్తుంది. ఇటీవల మచిలీ పట్నం డిపో పరిధిలో కూడా ఇలాంటి గిఫ్ట్‌ స్కీంను ప్రవేశపెట్టారు. ప్రతి 15 రోజుల కొకసారి లక్కీడిప్‌ ద్వారా ఇద్దరు విజేతలను ఎంపిక చేసి ఆకర్షణీయమైన బహుమతులు అందజేయనున్నట్లు డిపో మేనేజర్‌ పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లోనే సురక్షిత ప్రయాణం సాధ్యమని, ప్రయాణికులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అలాగే ఆకర్షణీయమైన బహుమతులు సొంతం చేసుకోవాలని మేనేజర్ కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభం..
ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభం..
నిమ్మ కాయను నేరుగా అప్లై చేస్తే చర్మానికి ఎంత హానికరమో తెలుసా
నిమ్మ కాయను నేరుగా అప్లై చేస్తే చర్మానికి ఎంత హానికరమో తెలుసా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025: మీరు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025: మీరు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..
భారతీయులకు భారీ గుడ్‌న్యూస్.. అమెరికా సంచలన నిర్ణయం!
భారతీయులకు భారీ గుడ్‌న్యూస్.. అమెరికా సంచలన నిర్ణయం!
వందకోట్లు ఇచ్చిన ఆ పని చేయను..
వందకోట్లు ఇచ్చిన ఆ పని చేయను..
మొబైల్‌ని ఫుల్ చార్జింగ్ చేయడానికి ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరం
మొబైల్‌ని ఫుల్ చార్జింగ్ చేయడానికి ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరం
కుంభమేళాపై విదేశీయులూ ఆసక్తి ఎన్ని దేశాల వారు ఆరా తీస్తున్నారంటే
కుంభమేళాపై విదేశీయులూ ఆసక్తి ఎన్ని దేశాల వారు ఆరా తీస్తున్నారంటే
సూపర్ ఫీచర్స్‌తో నయా ఫోన్ రిలీజ్ చేసిన రెడ్‌మీ..!
సూపర్ ఫీచర్స్‌తో నయా ఫోన్ రిలీజ్ చేసిన రెడ్‌మీ..!
మేం తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరగలేరు: కిషన్ రెడ్డి
మేం తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరగలేరు: కిషన్ రెడ్డి
థాయిలాండ్ కు పర్యాటకుల క్యూ.. 2024లో ఎంతమంది సందర్శించారంటే..?
థాయిలాండ్ కు పర్యాటకుల క్యూ.. 2024లో ఎంతమంది సందర్శించారంటే..?