AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP BRS: వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌పై మంత్రి అమర్నాథ్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు: తోట చంద్రశేఖర్‌

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు, ఆంధ్రా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. వైసీపీ, టీడీపీ పార్టీలు ప్రధాని మోడీ వద్ద మోకరిల్లాయని అందుకే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై ఎలాంటి పోరాటం చేయట్లేదని ఆయన విమర్శించారు.

AP BRS: వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌పై మంత్రి అమర్నాథ్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు: తోట చంద్రశేఖర్‌
Thota Chandrasekhar
Basha Shek
|

Updated on: Apr 11, 2023 | 8:01 PM

Share

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు, ఆంధ్రా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. వైసీపీ, టీడీపీ పార్టీలు ప్రధాని మోడీ వద్ద మోకరిల్లాయని అందుకే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై ఎలాంటి పోరాటం చేయట్లేదని ఆయన విమర్శించారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ పై కనీస అవగాహన లేకుండా ఏపీ కార్మిక శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ‘ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రధాన ఎజెండా. కేంద్రం కుట్రలను సాగనివ్వం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతాం. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో ఏపీలోని పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయి. అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పార్టీలు ప్రధాని మోడీ వద్ద మోకరిల్లాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని అడ్డుకోవడమే కాదు… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది’ అని చంద్రశేఖర్‌ చెప్పుకొచ్చారు.

కాగా విశాఖ ఉక్కు బిడ్డింగ్ ప్రక్రియలో సాధ్యాసాధ్యాలను పరిశీలించిన అనంతరం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటాని ఏపీ బీఆర్‌ఎస్‌ చీఫ్‌ తెలిపారు. బైలడిల్లాలోని ఐరన్ వోర్ గనులను వైజాగ్ స్టీలు ప్లాంట్, బయ్యారంలకు కేటాయించి, తెలుగు ప్రజల హక్కులను బీజేపీ కాపాడాలని తోట చంద్రశేఖర్‌ డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం  క్లిక్ చేయండి..