AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag Steel Plant: బిడ్డింగ్‌ వేస్తాం.. రూల్‌ బుక్‌ చూడండి.. తెలుగు రాష్ట్రాల మధ్య వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌పై డైలాగ్ వార్..

తెలుగు రాష్ట్రాల మధ్య బిడ్డింగ్‌ ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని.. బిడ్డింగ్‌ వేస్తామని బీఆర్ఎస్‌ సర్కార్‌ చెబుతుంటే.. రూల్‌ బుక్‌ బయటకు తీసింది ఏపీ ప్రభుత్వం. ప్రైవేటీకరణకు తెలంగాణ మద్దతిస్తున్నట్టు భావించాలా అని ప్రశ్నించారు ఏపీ మంత్రి.

Vizag Steel Plant: బిడ్డింగ్‌ వేస్తాం.. రూల్‌ బుక్‌ చూడండి.. తెలుగు రాష్ట్రాల మధ్య వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌పై డైలాగ్ వార్..
Vizag Steel Plant
Sanjay Kasula
|

Updated on: Apr 11, 2023 | 8:09 PM

Share

రెండేళ్లుగా వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు పోరాటం చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రైవేటీకరణకు సంబంధించి బిడ్డింగ్‌ గడువు సమీపిస్తోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే BRS ఎంట్రీ.. తెలంగాణ ప్రభుత్వ పెద్దల ప్రకటనలు పొలిటికల్‌ టర్న్‌ తీసుకున్నాయి. అదానీకి కట్టబెట్టేందుకే బయ్యారం గనులను.. విశాఖ ఉక్కును అమ్మేస్తున్నారని ఆరోపించిన మంత్రి KTR.. కేంద్రం చర్యలను అడ్డుకుంటామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ ప్రకటనలపై ప్రశ్నలు లేవనెత్తారు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌. ఈ విషయంలో రూల్‌ బుక్‌ను బయటకు తీశారు ఏపీ మంత్రి. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. మూడు లక్షల మంది ప్రజలు సాక్షిగా స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వద్దని సీఎం జగన్ గళం వినిపించారు. ప్రధానికి లేఖ రాశారు.. వైఎస్సార్‌సీపీ ఎంపీలు పార్లమెంట్‌లో నిలదీశారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతుగా నిలిచింది. మా పార్టీ, మా ప్రభుత్వం కార్మికుల పక్షానే ఉందని పేర్కొన్నారాయన.

ఈవోఐలో భాగంగా స్టీల్‌ప్లాంట్‌కు సింగరేణి అధికారులు. స్టీల్‌ప్లాంట్‌ ఫండ్‌ రైజింగ్‌లో భాగంగా ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ తెలుసుకొనేందుకు సింగరేణి అధికారులు వైజాగ్ వచ్చారు. ఈ చర్యను ప్లాంట్‌ రా మెటీరియల్‌ కాస్ట్‌ తగ్గించుకునే వ్యూహంగానే చూస్తోంది వైసీపీ.

ఈ విషయంలో ఎవరి వాదన ఎలా ఉన్నా.. పెట్టుబడుల ఉపసంహరణపై 2002లో కేంద్రం రూపొందించిన మార్గదర్శకాలపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ప్రజాప్రయోజనాలు ముడిపడి ఉంటే బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు ఇచ్చిన కొన్ని సడలింపులనే తెలంగాణ ఆధారంగా చేసుకుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

Follow Us
1953లో తాత నడిపిన ట్రాక్టర్‌‌ను మళ్లీ కొన్న మనవడు!
1953లో తాత నడిపిన ట్రాక్టర్‌‌ను మళ్లీ కొన్న మనవడు!
కొరియన్ కనకరాజు సినిమా రివ్యూ.. వరుణ్ తేజ్ హిట్ కొట్టాడా?
కొరియన్ కనకరాజు సినిమా రివ్యూ.. వరుణ్ తేజ్ హిట్ కొట్టాడా?
త్రిఫల-ఖర్జూరం లడ్డూ.. రోజూ ఒక్కటి తిన్నారంటే ఖతర్నాక్ బెనిఫిట్స్
త్రిఫల-ఖర్జూరం లడ్డూ.. రోజూ ఒక్కటి తిన్నారంటే ఖతర్నాక్ బెనిఫిట్స్
ఆధునిక ఫీచర్లతో దూసుకెళ్తున్న టాటా పంచ్
ఆధునిక ఫీచర్లతో దూసుకెళ్తున్న టాటా పంచ్
ఆర్ఆర్ఆర్ పనులకు మళ్లీ బ్రేక్.. ఆగస్టు 20 వరకు టెండర్ల గడువు ..
ఆర్ఆర్ఆర్ పనులకు మళ్లీ బ్రేక్.. ఆగస్టు 20 వరకు టెండర్ల గడువు ..
డీమాన్ పవన్‌ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? రీతూ చౌదరి ఆన్సర్ ఇదే
డీమాన్ పవన్‌ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? రీతూ చౌదరి ఆన్సర్ ఇదే
దేశవ్యాప్తంగా కుండపోత వానలు.. ఐఎండీ వార్నింగ్!
దేశవ్యాప్తంగా కుండపోత వానలు.. ఐఎండీ వార్నింగ్!
భారత సీఎన్‌జీ కార్ల మార్కెట్‌లో సరికొత్త రికార్డులు
భారత సీఎన్‌జీ కార్ల మార్కెట్‌లో సరికొత్త రికార్డులు
పరగడుపున మునగాకు, ఉసిరి షాట్‌తో తిరుగులేని ఆరోగ్యం మీ సొంతం!
పరగడుపున మునగాకు, ఉసిరి షాట్‌తో తిరుగులేని ఆరోగ్యం మీ సొంతం!
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్