AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అర్థరాత్రి ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్ధాలు.. అనుమానం వచ్చి ఉదయం వెళ్లి చూడగా.. వామ్మో

క్షుద్రపూజలు చేస్తే అంగవైకల్యం దూరమవుతుందని ఓ మాయలేడి చెప్పిన మాటలు నమ్మి.. ఏకంగా తన కుమారుడి ప్రాణాలే పోగొట్టుకున్నాడు ఓ తండ్రి. ఈ విషయం బయటకు రాకుండా బాలుడి శవాన్ని గుట్టుచప్పుడు కాకుండా కననం చేశారు. అయితే బాలుడు మరణించడంతో పూజలు చేసిన మహిళ చెప్పాపెట్టుకుండా అక్కడి నుంచి పారిపోయింది. ఒంగోలు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.

అర్థరాత్రి ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్ధాలు.. అనుమానం వచ్చి ఉదయం వెళ్లి చూడగా.. వామ్మో
Ongole Black Magi
Fairoz Baig
| Edited By: |

Updated on: Jul 14, 2026 | 12:48 PM

Share

ఒంగోలు జిల్లాలో దారుణం వెలుగు చూసింది. క్షుద్రపూజలు చేస్తే అంగవైకల్యం దూరమవుతుందని.. తండ్రి మాయమాటలు చెప్పి ఓ బాలుడిని పొట్టన పెట్టుకుంది ఓ మాయలేడి. పూజల తర్వాత బాలుడు ప్రాణాలు కోల్పోవడంతో మెళ్లగా అక్కడి నుంచి జారుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలు గోపాల్‌నగర్‌లో కిరణ అనే వ్యక్తి ఓ రెండు నెలల క్రితం ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. కిరణ్‌కు 5 ఏళ్ళ దివ్వాంగ బాలుడు ఉన్నాడు. బాలుడికి మాటలు కూడా సరిగా రావు. పోలియో కారణంగా రెండు కాళ్ళు పనిచేయవు. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా బాలుడికి నయం అవ్వలేదు.

అయితే ఈ విషయం తెలుసుకున్న నెల్లూరు జిల్లాకు చెందిన మోబీనా అనే మహిళ.. కొన్ని ప్రత్యేక పూజలు చేస్తే బాలుడి అంగవైకల్యం దూరమవుతుందని..కిరణ్‌కు తండ్రి నమ్మబలికింది. ఏ పుట్టలో ఏ పాము ఉందో చూద్దాం అన్నట్టుగా కిరణ సైతం తన కొడుకును నెల్లూరు జిల్లాకు చెందిన క్షుద్రపూజలు చేసే మహిళకు అప్పగించాడు. ఆమెను ఒంగోలుకు రప్పించి గోపాల్‌ నగర్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఆమెను అందులో ఉంచి తన కొడుకును కూడా అక్కడే ఉంచాడు. అప్పటి నుంచి ప్రత్యేక పూజల పేరుతో ఆ మహిళ బాలుడ్ని హింసించేది. కేకలు బయటకు రాకుండా పెద్ద శబ్దంతో భక్తి పాటలు పెట్టేంది.

బాలుడి చేతులు కట్టివేసి పూజలో భాగంగా అతనిని కొడుతూ ఉండేదని, బాలుడి కేకలు, మంత్రాలు వినిపించకుండా పెద్దగా పాటలు పెట్టేవారని స్థానికులు చెబుతున్నారు. పూజల పేరుతో మహిళ పెట్టిన హింసను తట్టుకోలేక మృతి చెందాడు. అయితే విషయం బయటకు తెలిస్తే పెద్ద రచ్చ అవుతుందని బయటపడిన తండ్రి.. గుట్టుచప్పుడు కాకుండా బాలుడి మృతదేహాన్ని పూడ్చి పెట్టాడు. అయితే ఇది గమనించిన స్థానికులు ఈ విషయాన్ని స్థానికులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

ఇళ్ళ మధ్య బాలుడికి పూజల పేరుతో ఓ మహిళ క్షుద్రపూజలు చేసిందని, ఆ హింస భరించలేక బాలుడు మృతి చెందాడని తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బాలుడి బంధువులు క్షుద్రపూజలు చేసిన మహిళను చితక్కొట్టారు. ఈ ఘటనపై పోలీసులు మృతి చెందిన బాలుడి తండ్రి కిరణ్‌, అతని భార్యను పిలిచి విచారించారు. తమ బిడ్డ అనారోగ్య కారణంతోనే మృతి చెందాడని బాలుడి తండ్రి పోలీసులకు చెప్పడంతో పోలీసులు వదిలేశారు. ప్రస్తుతం కిరణ్‌, క్షద్రపూజలు చేసిన మహిళ పరారీలో ఉన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us