Vizag Steel Plant: కేసీఆర్ ట్రాప్‌లో లక్ష్మీనారాయణ.. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

ఉమ్మడి రాష్ట్రంలోని సింగరేణి సంస్థలో ఆంధ్రప్రదేశ్‌కు కూడా వాటా ఉందని ఏపీ బీజేపీ నేత విష్ణువర్థన్‌ రెడ్డి తెలిపారు. తెలంగాణ కేసీఆర్‌ను దేవుడు అని పొగుడుతున్న ఆంధ్రా నాయకులు ఆ వాటా గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ అజెండాను ఏపీలో అమలు చేసేందుకు కొందరు నాయకులు సిద్ధమయ్యారని విష్ణువర్థన్‌ రెడ్డి ఆరోపించారు.

Vizag Steel Plant: కేసీఆర్ ట్రాప్‌లో లక్ష్మీనారాయణ.. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
Bjp Vishnu Vardhan Reddy
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 15, 2023 | 5:45 PM

ఉమ్మడి రాష్ట్రంలోని సింగరేణి సంస్థలో ఆంధ్రప్రదేశ్‌కు కూడా వాటా ఉందని ఏపీ బీజేపీ నేత విష్ణువర్థన్‌ రెడ్డి తెలిపారు. తెలంగాణ కేసీఆర్‌ను దేవుడు అని పొగుడుతున్న ఆంధ్రా నాయకులు ఆ వాటా గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ అజెండాను ఏపీలో అమలు చేసేందుకు కొందరు నాయకులు సిద్ధమయ్యారని విష్ణువర్థన్‌ రెడ్డి ఆరోపించారు. అజెండా మోస్తున్న వారి ఐదు కోట్ల ఆంధ్రులను అవమానించినట్టేనని అన్నారు. సీమ నీళ్లను దోచుకుంటున్న, ఆంధ్రా ఆస్తులను కాజేస్తున్న కేసీఆర్‌ను భుజాన మోయడం సిగ్గుచేటు అని విమర్శించారు. లేని సమస్యను సృష్టిస్తూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను అమ్మేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని విష్ణువర్థన్‌ రెడ్డి అన్నారు.

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖ ఉక్కు గురించి జయప్రకాష్ నారాయణను అడిగి తెలుసుకోవాలని హితవు చెప్పారు విష్ణువర్ధన్ రెడ్డి. విశాఖ ఉక్కుపై బిడ్ వేస్తానని లక్ష్మీనారాయణ ప్రకటించడంపై స్పందించిన విష్ణు.. ఆ డబ్బులు కేసీఆర్‌వా లేక కేటీఆర్‌వా చెప్పాలని డిమాండ్ చేశారు. భారత రాష్ట్రపతి పేరు మీదే ఆ భూములు ఉన్నాయని, అవి ఎలా అమ్మేస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ ట్రాప్‌లో లక్ష్మీనారాయణ పడ్డారని, హైదరాబాద్‌లో ఉంటున్నందున తెలంగాణ ప్రభుత్వానికి భయపడి ఉండొచ్చని విష్ణు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కోసం వినూత్నంగా నిధుల సమీకరణ..

క్రౌడ్‌ ఫండింగ్‌ విధానంలో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కోసం తాము బిడ్స్‌ దాఖలు చేశామని సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ తెలిపారు. ఎనిమిది కోట్ల మంది ఆంధ్రులు నెలకు వంద చొప్పున ఇస్తే ప్రతీ నెలా 800 కోట్లు వస్తుందని, అలా నాలుగు నెలలు చేస్తే ప్లాంట్‌ను నిలబెట్టుకోవచ్చని అన్నారు. తమ ప్రతిపాదనను ప్రజల ప్రపోజల్‌గా చూడాలని అధికారులను కోరామని తెలిపారు బిడ్డింగ్‌ పత్రాలు దాఖలు చేసిన అనంతరం లక్ష్మీనారాయణ టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు.

ఇవి కూడా చదవండి

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఈవోఐకి అనూహ్య స్పందన..

ఇదిలాఉంటే.. విశాఖ స్టీల్‌ప్లాంట్ ఈవోఐకి అనూహ్య స్పందన వచ్చింది. మరోవైపు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ EOI గడువు మరో 5 రోజులు పెంచారు. ఏప్రిల్ 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు పొడిగించారు. ఇప్పటి వరకు 22 సంస్థలు పాల్గొన్నట్టు సమాచారం. మరిన్ని కంపెనీలు పాల్గొంటాయనే సమాచారంతో గడువు పెంచారు. ఈ ఈవోఐలో తెలంగాణ పాల్గొనడంపై అధికారులు నిర్ధారించలేదు. ఈ ఈవోఐలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

క్రౌడ్‌ఫండింగ్‌ ద్వారా మూలధనం సేకరణ..కాగా,

విశాఖ స్టీల్ ప్లాంట్ ఈవోఐలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా పాల్గొన్నారు. క్రౌండ్ ఫండింగ్ ద్వారా మూలధనం సేకరిస్తామని ప్రకటించారు. 8 కోట్లమంది ప్రజలు ఒక్కొక్కరు రూ.100 ఇచ్చినా.. రూ.800 కోట్లు అవుతుందని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. 4 నెలలపాటు ఒక్కొక్కరు రూ.100 ఇస్తే రూ.3,200 కోట్లు అవుతుందన్నారు. స్టీల్‌ప్లాంట్‌కు కావాల్సింది నిధులు, ముడిసరుకు అని, అవి ఎక్కడ నుంచి.. ఎలా వచ్చాయనేది అనవసరం అని పేర్కొన్నారు. 4 నెలల్లో క్రౌడ్‌ఫండింగ్‌ చేస్తామని ప్రకటించారు లక్ష్మీనారాయణ.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..