AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: కూటమిలో రాజుకున్న కుంపటి.. విశాఖ నుంచి ఫ్రెండ్లీ పోటీకి సిద్ధమంటున్న బీజేపీ నేతలు

విశాఖ లోక్‌సభలో స్నేహ పూర్వక పోటీకి అనుమతి ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ నేతలు హై కమాండ్‌పై ఒత్తిడి తీసుకువస్తున్నారు. అధికారికంగానే తమ విజ్ఞప్తిని జిల్లా అధ్యక్షుడికి ఇచ్చి, పార్టీ కార్యాలయంలోనే మీడియాకు వెల్లడించారు బీజేపీ నాయకులు. మరోవైపు ఇప్పటికే కూటమి నుంచి టికెట్ ఖరారై ప్రచారం కూడా ప్రారంభించారు టీడీపీ నేత శ్రీభరత్.

Vizag: కూటమిలో రాజుకున్న కుంపటి.. విశాఖ నుంచి ఫ్రెండ్లీ పోటీకి సిద్ధమంటున్న బీజేపీ నేతలు
Bjp
Eswar Chennupalli
| Edited By: Balaraju Goud|

Updated on: Apr 03, 2024 | 10:57 AM

Share

విశాఖ లోక్‌సభలో స్నేహ పూర్వక పోటీకి అనుమతి ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ నేతలు హై కమాండ్‌పై ఒత్తిడి తీసుకువస్తున్నారు. అధికారికంగానే తమ విజ్ఞప్తిని జిల్లా అధ్యక్షుడికి ఇచ్చి, పార్టీ కార్యాలయంలోనే మీడియాకు వెల్లడించారు బీజేపీ నాయకులు. మరోవైపు ఇప్పటికే కూటమి నుంచి టికెట్ ఖరారై ప్రచారం కూడా ప్రారంభించారు టీడీపీ నేత శ్రీభరత్. మరి ఈ పరిస్థితుల్లో బీజేపీ హై కమాండ్ అనుమతి ఇస్తుందా? బీజేపీలో టిక్కెట్ల చిచ్చు మరో లెవల్ కి చేరింది..!

వైజాగ్ లోక్‌సభ సీటుపై కూటమిలో విబేధాలు ప్రారంభం అయ్యాయి. శ్రీభరత్ ను అభ్యర్ధిగా టీడీపీ ప్రకటించిన తర్వాత కూడా బీజేపికే కేటాయించాలని కమలంలో ఒక వర్గం డిమాండ్ చేస్తోంది. ఇందుకోసం బీజేపీ అనుబంధ సంఘాలు, మోర్చాల ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైజాగ్ లోక్ సభ విషయంలో పునరాలోచించాలని పార్టీ పెద్దలను కోరాలని నిర్ణయం తీసుకున్నారు. అనపర్తి, జమ్మలమడుగు, నర్సాపురం పార్లమెంట్ వంటి చోట మార్పులు జరుగున్నప్పుడు వైజాగ్ ను కూడా మార్చాలని డిమాండ్ చేస్తోంది బీజేపీలోని ఈ వర్గం.

అంతేకాదు వైజాగ్ లోక్‌సభను జీ వీ ఎల్ కు కేటాయించాలని కోరుతూ తీర్మానం చేశారు. వైజాగ్ నుంచి పోటీపై ఆశ పెట్టుకున్నారు రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహ రావు. ఇతర పార్టీల కుటుంబ అవసరాల కోసం సీటును బీజెపీ వదులుకోవాల్సి వచ్చిందంటూ వ్యాఖ్యలు చేసిన జీ వీ ఎల్, ఇంకా ఆశ వదులుకోలేదు. ఈ నేపథ్యంలో బీజేపీకే సీట్ ఇవ్వాలంటూ మోర్చా నేతలతో పాటు నార్త్ ఇండియన్ సంఘాలు బీజేపీ కార్యాలయంలోనే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం విశేషం..!

బీజేపీ గాజువాక నియోజకవర్గ ఇంచార్జ్ కరణంరెడ్డి నర్సింగ్ రావు, విశాఖ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు గజపతి రావు, యువ మోర్చా, మహిళా మోర్చా అధ్యక్షులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. విశాఖ లోక్‌సభను బీజేపీకి కేటాయించాలని జిల్లా అధ్యక్షుడికి వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్రంలో బీజేపీకి అత్యంత ఆదరణ ఉన్న ప్రాంతం విశాఖ అని, గతంలో విశాఖ మేయర్‌గా, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచిన నేపథ్యం ఉందన్నారు బీజేపీ నేతలు. నాలుగేళ్లుగా పార్టీ ని బూతు స్థాయిలో బలోపేతం చేశామని గుర్తు చేశారు. మూడేళ్లుగా విశాఖలోనే నివాసం ఉంటూ ఈ ప్రాంత ప్రజల సమస్యలను పార్లమెంట్ దృష్టికి తెచ్చారని, ఆయనకు టికెట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.

కూటమికి, పొత్తుకు మేము వ్యతిరేకం కాదు అంటూనే విశాఖ లోక్‌సభకు పోటీ చేయకుంటే పార్టీ రాష్ట్రంలో చచ్చిపోయినట్టే అంటూ వ్యాఖ్యలు చేశారు. మేమేమీ బీజేపీ రెబెల్స్ కాదని, స్థానిక పరిస్థితులను పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం అన్నారు. అమరావతి, ఢిల్లీకి కూడా వెళ్ళి పార్టీ పెద్దలను కలిసి మా అవేదనను విన్నవిస్తామన్నారు. జమ్మలమడుగును బీజేపీకి మార్చి కడప లోక్ సభ ఇస్తున్నప్పుడు విశాఖ లోక్ సభ ను కూడా మార్చాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. దీనిపై బీజేపీ హై కమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…