అర్ధరాత్రి స్మశానంలో వింత శబ్దాలు.. తెల్లారేసరికి వెళ్లి చూడగా.! అక్కడ కనిపించిన దృశ్యానికి..
రోజు రోజుకీ మానవుడు అన్ని రంగాలలోనూ అభివృద్ధి చెందుతున్నాడు. నాగరికత పెరుగుతోంది. భారత్ పాశ్యాత్య దేశాలతో పోటీ పడుతూ ముందుకు దూసుకెళ్తోంది. అయినా కొందరి ఆలోచనలు మాత్రం మారడం లేదు. మూఢనమ్మకాలను వీడడంలేదు. గుప్తనిధులు, క్షుద్రపూజలు, మాయలు..
చిత్తూరు జిల్లా SR పురం మండలం లో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. మర్రిపల్లి స్మశానవాటికలో పెద్ద మనిషి బొమ్మను చేసి, పసుపు కుంకుమ, నిమ్మకాయలు, అగ్ని గుండం ఏర్పాటు చేసి చుట్టూ దీపాలు పెట్టి క్షుద్ర పూజలు చేశారు. గ్రామానికి సమీపంలోనే ఉన్న స్మశానవాటికలో క్షుద్ర పూజల ఆనవాళ్లు గుర్తించిన స్థానికులు భయంతో వణికిపోయారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్మశాన వాటిక దాటుకొని వంకలో ఉపాధి పని చేసేందుకు వెళుతున్న కూలీలు ఈ క్షుద్ర పూజల ఆనవాళ్లు గుర్తించారు. విషయాన్ని గ్రామంలోని పెద్దల దృష్టికి తీసుకెళ్లగా వారు పోలీసులకు సమాచారమిచ్చారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో క్షుద్ర పూజలు జరిగాయంటున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ ఇక్కడి స్మశాన వాటికలో ఇలా క్షుద్రపూజలు జరుగుతున్నాయని భయాందోళన చెందారు. స్మశానవాటిక మీదుగానే తమ గ్రామాలకు వెళ్లాలని, ఈ క్రమంలో ఇక్కడ క్షుద్ర పూజలు జరుగుతుండటం అటు వెళ్లాలంటే భయమేస్తుందని ఆరోపిస్తున్నారు.
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!

