రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వ పట్టించుకోవడం లేదు… ఏలూరు ఘటనపై కేంద్ర జోక్యం అవసరమన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్…

తుపాన్ వల్ల నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రైతుల్లో నిరాశానిస్పృహలు తొలగించడం తమ తక్షణ కర్తవ్యమని తెలిపారు.

రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వ పట్టించుకోవడం లేదు... ఏలూరు ఘటనపై కేంద్ర జోక్యం అవసరమన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 08, 2020 | 5:10 PM

తుపాన్ వల్ల నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రైతుల్లో నిరాశానిస్పృహలు తొలగించడం తమ తక్షణ కర్తవ్యమని తెలిపారు. ఏలూరులో అంతుబట్టని అనారోగ్య సమస్యలపై కేంద్ర బృంద విచారణ అవసరమన్నారు. జనసేన, బీజేపీ ముఖ్య నాయకుల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. తుపాను వలన నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్థికాభివృద్ధికి దోహదపడే చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, ఫలితంగా నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. అంతేకాకుండా రాయలసీమలో రైతాంగం ఇబ్బందిపడుతోందని తెలిపారు. రాష్ట్రంలో రోడ్డు వ్యవస్థ అధ్వానంగా తయారైందని విమర్శించారు.

రాజకీయ కార్యాచరణపైనా చర్చ….

రానున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికతోపాటు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కోసం మార్గదర్శకాలను రూపొందించుకోవాలని బీజేపీ, జనసేన ముఖ్య నాయకులు నిర్ణయం ఈ సమావేశంలో నిర్ణయించారు. అంతేకాకుండా రాష్ట్రంలో అమలు కాని ఈడబ్ల్యూ‌ఎస్ రిజర్వేషన్ విధానాన్ని రాష్ట్రంలో అమలు అయ్యేలా కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తీర్మానించుకున్నారు. రాష్ట్ర రాజకీయ, ఆర్థిక పరిస్థితులను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని నాయకులు నిర్ణయించారు. కాగా జనసేన, బీజేపీ ముఖ్య నాయకుల సమావేశానికి జనసేన పార్టీ నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, పార్టీ సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్.. బీజేపీ నుంచి వి.సతీష్ జీ. సునీల్ దేవధర్, సోము వీర్రాజు, మధుకర్ హాజరయ్యారు.