బ్రేకింగ్ న్యూస్: తిరుపతి సమీపంలో రైల్వే ట్రాక్‌పై పేలిన బాంబు…తీవ్రంగా గాయపడిన మహిళ
చిత్తూరుజిల్లా రేణిగుంట రైల్వే ట్రాక్ పై ఒక్కసారిగా కలకలం రేగింది. రైలు పట్టాలపై ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది...
చిత్తూరుజిల్లా రేణిగుంట దగ్గర రైల్వే ట్రాక్ పై కలకలం రేగింది. రైలు పట్టాలపై ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. చేతి వేళ్లు సహా కుడిచేయి భాగం అంతా తూట్లుపడిపోయి తీవ్ర రక్తస్రావమైంది. ఒక డబ్బా పేలి ఈ ఘటన చోటుచేసుకున్నట్టు మహిళ చెబుతోంది. హుటాహుటీన పేలుడు ప్రాంతానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గాయపడ్డ బాధితురాల్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా రేణిగుంట రైల్వే స్టేషన్లో రైళ్ల రాకపోకల్ని కాసేపు నిలుపుదల చేశారు.