హెచ్ 1 బీ వీసా పేరుతో మోసం… 10 కోట్లు లూటీ… కేసు నమోదు చేసిన అమెరికా పోలీసులు.. నిందితులు తెలుగువారే….
అమెరికా హెచ్ 1 బీ వీసా యూఎస్ వెళ్లే ప్రతి ఒక్కరి కల. కొలువు, నెలవు దొరుకుతుందన్న ఆశ... అయితే కొందరి కలలను మరికొందరు సొమ్ము చేసుకుంటున్నారు.

H-1B fraud: AP couple on the run after duping Telugu student .. అమెరికా హెచ్ 1 బీ వీసా యూఎస్ వెళ్లే ప్రతి ఒక్కరి కల. కొలువు, నెలవు దొరుకుతుందన్న ఆశ… అయితే కొందరి కలలను మరికొందరు సొమ్ము చేసుకుంటున్నారు. వీసాల పేరుతో బాధితుల దగ్గరి నుంచి లక్షల్లో రాబడుతూ బోర్డు తిరగేస్తున్నారు. ఇటువంటి ఘటనే అమెరికాలో తాజాగా వెలుగులోకి వచ్చింది.
మనోళ్లే మనొళ్లను ముంచారు…
పశ్చిమ గోదావరికి చెందిన ముత్యాల సత్యనారాయణ కొడుకు, కోడలు సునిల్, ప్రణీత అమెరికాలో నివాసముంటున్నారు. అక్కడ ఉంటున్న మన తెలుగు విద్యార్థులకు వీసాలు ఇప్పిస్తామని, తమది వీసా కన్సల్టెన్సీ కంపెనీ అని చెప్పి నమ్మించారు. ఒకొక్కరి దగ్గరి నుంచి దాదాపు 25 వేల డాలర్లను తీసుకున్నారు. అలా బాధితులందరి దగ్గర కలిపి 10 కోట్ల రూపాయలను వసూలు చేసి యూరప్ పారిపోయినట్లు అమెరికా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే సునిల్, ప్రణీతలపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
కాగా, పశ్చిమ గోదావరిలో ఉండే సునిల్ తండ్రి ముత్యాల సత్యనారాయణను వెతికే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేయగా… అతడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. సునిల్ బాధితుల దగ్గరి నుంచి వసూలు చేసిన నగదును సత్యనారాయణ అకౌంట్లోకి వేసినట్లు సమాచారం.