కామన్ మ్యాన్ క్యాష్ సిస్టంకు కితాబు… అవినీతికి ఆస్కారం లేని చర్య అని బిల్ గేట్స్ ప్రశంస…

ప్రపంచ కుబేరుడు భారతీయుల నగదు బదిలీ విధానాన్ని భేష్ అని మెచ్చుకున్నారు. అవినీతికి ఆస్కారం లేని వ్యవస్థ అని, నూతన ఆవిష్కరణలకు నిదర్శనమని కీర్తించారు.

కామన్ మ్యాన్ క్యాష్ సిస్టంకు కితాబు... అవినీతికి ఆస్కారం లేని చర్య అని బిల్ గేట్స్ ప్రశంస...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 08, 2020 | 4:37 PM

People should study India right now: Gates on UPI system’s implementation ప్రపంచ కుబేరుడు భారతీయుల నగదు బదిలీ విధానాన్ని భేష్ అని మెచ్చుకున్నారు. అవినీతికి ఆస్కారం లేని వ్యవస్థ అని, నూతన ఆవిష్కరణలకు నిదర్శనమని కీర్తించారు. సింగపూర్ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో  బిల్‌గేట్స్ వర్చువల్ పద్ధతిలో  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారత దేశంలో యూపీఐ విధానంలో నగదు బదిలీ జరుగుతోందని అన్నారు.

మొబైల్ ద్వారానే లావాదేవీలు…

యూపీఐ విధానంలో కేవలం స్మార్ట్ ఫోన్ ద్వారానే నగదు బదిలీ చేయవచ్చని బిల్ గేట్స్ వివరించారు. తద్వారా సమయం ఆదా అవుతుందని, బ్యాంకు సేవలు మొబైల్ ద్వారా అరచేతిలో అందుబాటులోకి వచ్చాయని ప్రశంసించారు. నగదు లావాదేవీలన్నీ ఆన్‌లైన్ ద్వారా జరిగితే అవినీతికి తావుండదని తెలిపారు. యూపీఐ విధానం కరోనా కాలంలో ఎంతో బాగా ఉపయోగపడిందని అన్నారు. ఒక యూపీఐ విధానమే కాకుండా భారత్ లో పేటీఎం, అమెజాన్ పే, గూగుల్ పే వంటి మొబైల్ ఆధారిత నగదు లావాదేవీల సంస్థలున్నాయని తెలిపారు. నూతన ఆవిష్కరణల గురించి వెతకాలంటే చైనా కాకుండా భారత్ వైపు చూడాలని సూచించారు. బిల్ గేట్స్ సంస్థ నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఈ సందర్భంగా బిల్ గేట్స్ తెలిపారు.