ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శిఖరం ఎత్తు ఎంతో తెలుసా… ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. వెల్లడించిన నెపాల్ – చైనా..
ఎవరెస్టు పర్వతాన్ని చోమోలుంగ్మా అని టిబెటియన్లు పిలుస్తారు. సాగర్ మాతా అని నేపాలీలు పిలుస్తారు. మరికొందరు గౌరీ శంకర శిఖరం అని కూడా పిలుస్తారు.
New height of Mount Everest revealed ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శిఖరం ఏదంటే ఠక్కమని చెప్పే సమాధానం మౌంట్ ఎవరెస్ట్ అని… దాని ఎత్తు ఎంతంటే చెప్పేది 8,848 మీటర్లని… ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్టే… అయితే దాని ఎత్తు మాత్రం పెరిగింది. గత ఐదు సంవత్సరాలుగా పర్వత శిఖరం ఎత్తుపై పలు వాదనలు వినిపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా భూకంపాలు, పర్యావరణ సమస్యల దృష్ట్యా ఎవరెస్ట్ ఎత్తు తగ్గి ఉంటుందని అనుకున్నారంతా… కానీ, ఎవరెస్ట్ ఎత్తు తగ్గలేదు. తాజాగా చైనా – నెపాల్ విడుదల చేసిన అధికారిక లెక్కల ప్రకారం మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు 8,848.86 మీటర్లు. అంటే ఎత్తు 0.86 మీటర్లు పెరిగిందన్న మాట.
ఎవరెస్ట్‌ను ఎవరెవరు ఏమని పిలుస్తారో తెలుసా…
ఎవరెస్టు పర్వతాన్ని చోమోలుంగ్మా అని టిబెటియన్లు పిలుస్తారు. సాగర్ మాతా అని నేపాలీలు పిలుస్తారు. మరికొందరు గౌరీ శంకర శిఖరం అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే ఎత్తైన పర్వతమైన ఎవరెస్ట్ సముద్రమట్టానికి 8,848 మీటర్లు లేదా 29,028 అడుగుల ఎత్తులో ఉన్నది. ఈ పర్వతం నేపాల్లో ఉంది.