Secretariat Employees: ఏపీ సచివాలయ ఉద్యోగులకు షాక్.. బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..
AP Secretariat Employees: ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ పలు కీలక సూచనలు చేసింది. ప్రభుత్వ ఉద్యోగులందరికీ బయోమెట్రిక్ హాజరును
AP Secretariat Employees: ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ పలు కీలక సూచనలు చేసింది. ప్రభుత్వ ఉద్యోగులందరికీ బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి రేవు. ముత్యాల రాజు బయోమెట్రిక్ అటెండెన్సును తప్పనిసరి చేస్తూ గురువారం మెమో జారీ చేశారు. కోవిడ్-19 ఉధృతి అనంతరం తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపత్యంలో బయోమెట్రిక్ అటెండెన్స్‌ను తప్పనిసరి చేసినట్లు ప్రభుత్వం మెమోలో వెల్లడించింది. ఉద్యోగులందరికీ ఐదు రోజుల పనిదినాల విధానాన్ని 2022 జూన్ వరకూ పొడిగించిన నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ విధుల్లో ఉండాలంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది. సోమవారం నుంచి శుక్రవారం వరకూ ప్రతిరోజూ ఉద్యోగుల హాజరును పరిశీలించాల్సిందిగా ఆయా శాఖల కార్యదర్శులకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
ఉదయం 10 గంటల 10 నిముషాల అనంతరం విధులకు వస్తే ఆలస్యంగా హాజరైనట్టు పరిగణిస్తామని ప్రభుత్వం పేర్కొంది. సచివాలయ మాన్యువల్ ప్రకారం నెలలో మూడు సార్లు మాత్రమే ఆలస్యంగా హాజరును అనుమతిస్తామని.. ఆ తర్వాత వేతనాల్లో కోత ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. దీంతోపాటు ఉదయం 10 గంటల నుంచి 5.30 గంటల వరకూ విధుల్లో ఉంటేనే పూర్తి హాజరుగా పరిగణిస్తామని సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. సమయానుకూలంగా ఉద్యోగులు నడుచుకోవాలని.. లేకపోతే చర్యలు తప్పవంటూ అధికారులు వెల్లడించారు.
Also Read: