Watch Video: డీజిల్ క్యాన్‌తో వెళ్తూ బస్సును ఢీ కొన్న బైక్.. క్షణాల్లో మంటలు వ్యాప్తి..
డీజిల్ క్యాన్‌తో వెళుతున్న ఒక బైక్ హఠాత్తుగా వెళ్లి ఆర్టీసీ బస్సును ఢీకొంది. అంతే బైక్ కింద పడి డీజిల్ క్యాన్ పగిలి క్షణాల్లో మంటలు వ్యాపించాయి. డీజల్ తీసుకెళ్తున్న బైక్ అగ్నికి ఆహుతి అయిపోయింది. అయితే త్రుటిలో ప్రమాదం తప్పింది. అదే బైక్ గనుక బస్సు కిందకు జారి వెళ్లి ఉంటే బస్సులో ఉన్న ప్రయాణికులు అంతా మంటల్లో చిక్కుకునేవారు. టైం బాగుంది కాబట్టి బైక్ నడుపుతున్న వ్యక్తి కూడా స్వల్ప గాయాలతో బయటపడ్జాడు.

డీజిల్ క్యాన్‌తో వెళుతున్న ఒక బైక్ హఠాత్తుగా వెళ్లి ఆర్టీసీ బస్సును ఢీకొంది. అంతే బైక్ కింద పడి డీజిల్ క్యాన్ పగిలి క్షణాల్లో మంటలు వ్యాపించాయి. డీజల్ తీసుకెళ్తున్న బైక్ అగ్నికి ఆహుతి అయిపోయింది. అయితే త్రుటిలో ప్రమాదం తప్పింది. అదే బైక్ గనుక బస్సు కిందకు జారి వెళ్లి ఉంటే బస్సులో ఉన్న ప్రయాణికులు అంతా మంటల్లో చిక్కుకునేవారు. టైం బాగుంది కాబట్టి బైక్ నడుపుతున్న వ్యక్తి కూడా స్వల్ప గాయాలతో బయటపడ్జాడు. ఈ ఘటన కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు మండలంలో చోటు చేసుకుంది. పి తుమ్మలపాలెం గ్రామం సమీపంలో ఓ వ్యక్తి తన బైక్‌పై డీజిల్ క్యాను తీసుకొని వెళ్తున్నాడు. అటుగా ఓ ఆర్టీసీ బస్సు కూడా వస్తుంది. ఈ సమయంలో పెద్దగా ఈదురు గాలులు వీయడంతో బైక్ అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొంది. అంతే బైక్ కిందపడి బైక్ పై ఉన్న డీజిల్ క్యాన్ పగిలి ఒక్కసారిగా క్షణాల్లో మంటలు వ్యాపించాయి. అందరూ చూస్తుండగానే బైకు ఖాళీ బూడిదైపోయింది.
ఇంతవరకు బాగానే ఉంది కానీ.. అదే బైక్ కనుక ఆర్టీసీ బస్సు కిందపడి మంటలు వ్యాపించి ఉంటే మాత్రం చాలా పెద్ద ప్రమాదమే జరిగేది. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అందరూ కూడా మంటల్లో చిక్కుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడి ఉండేవి. బైక్ నడుపుతున్న వ్యక్తి ఈదురు గాలి కారణంగా హ్యాండిల్ కంట్రోల్ చేయలేకపోతున్నానని గమనించి రన్నింలోనే దూకేశాడు. ఈ క్రమంలో బండి తారు రోడ్డుపై జారుకుంటూ వెళ్లి మంటలు వ్యాపించాయి. దీంతో మొత్తం కాలిపోయింది. ఒకవేళ బైక్ నుంచి దూకకుండా ఉండి ఉంటే బండి నడుపుతున్న బాబుల్ రెడ్డి అనే వ్యక్తి కూడా మంటలో కాలిపోయేవాడు. టైం బాగుండటంతో స్వల్ప గాయాలతో బాబుల్ రెడ్డి బయటపడ్డాడంటున్నారు స్థానికులు. అంతేకాక ఎదురుగా వస్తున్న బస్సుకు కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు. అందుకే బైక్ నడిపేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలని.. అందులోను ఇలాంటి ప్రమాదకరమైన లిక్విడ్స్ తీసుకువెళ్లే సమయంలో మరింత జాగ్రత్తగా వాహనాలను నడిపితే మంచిదని చెబుతున్నారు స్థానికులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
