అప్పుడు కుదరని ‘స్పెషల్ స్టేటస్‌’.. ఈసారి సాధ్యమవుతుందా? ఈసారి కూటమి ఎజెండా అదేనా..

ఏపీలో విపక్షాల పొత్తు.. రాజకీయాలకు కొత్త రంగులు అద్దుతోంది. ఒకప్పుడు కలిసినడిచి.. ఆ తర్వాత విభేదాలతో విడిపోయిన పార్టీలు.. ఇప్పుడు మళ్లీ ఒక్కటవడం ఆసక్తిరేపుతోంది. అయితే, అప్పుడు ఏ హోదాఅంశం కారణంగా ఈ పార్టీల మధ్య చీలిక వచ్చిందో..

అప్పుడు కుదరని 'స్పెషల్ స్టేటస్‌'.. ఈసారి సాధ్యమవుతుందా? ఈసారి కూటమి ఎజెండా అదేనా..
Big News Big Debate
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 13, 2024 | 6:59 PM

ఏపీలో విపక్షాల పొత్తు.. రాజకీయాలకు కొత్త రంగులు అద్దుతోంది. ఒకప్పుడు కలిసినడిచి.. ఆ తర్వాత విభేదాలతో విడిపోయిన పార్టీలు.. ఇప్పుడు మళ్లీ ఒక్కటవడం ఆసక్తిరేపుతోంది. అయితే, అప్పుడు ఏ హోదాఅంశం కారణంగా ఈ పార్టీల మధ్య చీలిక వచ్చిందో… మళ్లీ అదే అంశం వీటి మధ్య కీలకంగా మారేట్టు కనిపిస్తోంది. హోదా విషయంలో తప్ప.. బీజేపీతో తనకు విభేదాలు లేవంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే.. ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. మరోసారి ప్రత్యేక హోదా టాపిక్‌ను ఎలక్షన్‌ ప్లాట్‌ఫామ్‌ మీదకు తీసుకొచ్చాయి.

ఎన్నికల సమయం దగ్గరపడుతున్నకొద్దీ.. ఏపీ రాజకీయం రసవత్తర నాటకీయాన్ని తలపిస్తోంది. 2014ఎన్నికల్లో కలిసి నడిచిన బీజేపీ,జనసేన, టీడీపీ… పదేళ్ల తర్వాత మళ్లీ ఒక్కటయ్యాయి. ప్రత్యేక హోదా ఇవ్వడం లేదనే కారణంతో… 2019కి ముందు బీజేపీతో విభేదించిన జనసేన, టీడీపీ.. ఎన్డీఏ నుంచి బయటకొచ్చాయి. అయితే ఇప్పుడు గతం మరిచిపోయి.. 2024 ఎన్నికలకు కూటమిగా సన్నద్ధమవుతున్నాయి.

బీజేపీతో పొత్తుపై తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో తప్ప.. తానెక్కడా బీజేపీతో విభేదించలేదని చెప్పారు చంద్రబాబు. రాబోయే రోజుల్లో ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఎలాంటి న్యాయం చేస్తుందో చూడాలన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం చేశారు. హోదా ఇస్తేనే ఎన్డీఏలో కలుస్తానని చంద్రబాబు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. పాచిపోయిన లడ్డూలు అంటూ పవన్‌ చేసిని వ్యాఖ్యలను గుర్తు చేసిన భరత్‌… ఏ ముఖం పెట్టుకుని బీజేపీతో కలుస్తున్నారని నిలదీశారు.

ఎవరి వెర్షన్‌ ఎలా ఉన్నా… ప్రత్యేక హోదా అంశం మరోసారి ఎన్నికల ఎజెండా కాబోతోందా? అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్పుడు స్పెషల్‌ స్టేటస్‌ విషయంలో బీజేపీతో దెబ్బలాడిన జనసేన, టీడీపీ… ఇప్పుడా విషయంలో ఎలాంటి హామీ లభించిందని ఎన్డీఏలోకి రీ ఎంట్రీ ఇచ్చాయనేది చర్చనీయాంశమైంది. కూటమిగా ఉన్న ఈ మూడు పార్టీల మధ్య.. హోదా విషయంలో ఎలాంటి రాజీ కుదిరిందన్నదీ ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌గా మారింది.