Big News Big Debate: TDP రాజీనామా సవాళ్లకు YCP ఇచ్చే ఆన్సరేంటి? హోదా ముగిసిన అధ్యాయమైతే అజెండాలోకి ఎందుకొచ్చింది?
Big News Big Debate - AP Special Status: ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా అంశంపై రాజకీయంగా మళ్లీ రచ్చరచ్చ జరుగుతోంది. మెడలు వంచుతామన్న మగాడు ఎక్కడంటూ టీడీపీ ప్రశ్నిస్తుంటే.. చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే
Big News Big Debate – AP Special Status: ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా అంశంపై రాజకీయంగా మళ్లీ రచ్చరచ్చ జరుగుతోంది. మెడలు వంచుతామన్న మగాడు ఎక్కడంటూ టీడీపీ ప్రశ్నిస్తుంటే.. చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే సజీవంగా ఉంచిందే తమ పార్టీ అంటోంది వైసీపీ. ముగిసిన అధ్యాయం పట్టుకుని పార్టీలన్నీ డ్రామాలు ఆడుతున్నాయని బీజేపీ ఆరోపిస్తుంటే… ఉద్యమానికి సన్నద్దమవుతున్నాయి లెఫ్ట్ పార్టీలు. ఇంతకీ స్టేటస్‌పై ఆశలు సజీవంగా ఉన్నాయా లేక రాజకీయ అజెండాగా పార్టీలు మలుచుకుంటున్నాయా.?
విభజన అంశాల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ వేసిన కమిటీ అజెండాలో ప్రత్యేకహోదా పెట్టి తర్వాత తొలగించడం ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది. ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు సవాళ్లు, విమర్శలతో నోటికి పనిచెబితే.. లెఫ్ట్ పార్టీలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి.
హోదాపై కేంద్రం మెడలు వంచుతామన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించడం లేదంటోంది టీడీపీ. అజెండాలో నుంచి తీసేస్తే బలం, బలగం ఉండి కూడా నిలదీయలేని స్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందా అంటూ నిలదీస్తోంది. హోదాపై వైసీపీ రాజీనామాలకు సిద్దమా అంటూ సవాల్ విసురుతోంది తెలుగుదేశం.
రాష్ట్రానికి హోదా రాకుండా వెన్నుపోటు పొడిచిందే తెలుగుదేశమని వారికి మాట్లాడే నైతిక హక్కే లేదంటోంది వైసీపీ. ఇప్పటికీ హోదా అంశం మార్మోగుతుంది అంటే కారణం వైసీపీయే అంటున్నారు మంత్రులు. హోదా కోసం ఎంపీలు రాజీనామాలు చేసిన చరిత్రను గుర్తుచేస్తున్నారు.
ప్రత్యేక హోదా అంశంలో రీజనల్ పార్టీలు చీఫ్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాయంటోంది బీజేపీ. లేని ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి నాటకాలు ఆడుతున్నారని.. ప్రధానిని కలిసినప్పుడు వీరంతా హోదా గురించి మాట్లాడారా అంటూ ఎదురు దాడిచేస్తోంది కాషాయం.
హోదా ఇస్తామన్న బీజేపీ.. కాలర్ పట్టుకుని సాధిస్తామన్న ప్రధాన పార్టీల తీరును ఎండగడుతున్న కమ్యూనిస్టులు ప్రత్యక్ష కార్యాచరణకు సిద్దమవుతున్నారు. బీజేపీ మినహా కలిసివచ్చే అన్ని పార్టీలను, ప్రజాసంఘాలను ప్రత్యేక హోదా సాధన ఉద్యమంలోకి ఆహ్వానిస్తామంటున్నారు.
స్పెషల్ స్టేటస్ కారణంగా మరోసారి రాజుకున్న ఏపీ రాజకీయం మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. నేతలు చేస్తున్న ప్రకటనలతో.. అంతకంతకూ పెరుగుతున్న హీటు.. ఎంతవరకు వెళ్తుందనేది చూడాలి.
(బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్)
ఇదే అంశంపై టీవీ9 స్టూడియోలో బిగ్ డిబేట్ జరిగింది… పూర్తి సమాచారం కోసం కింద వీడియో చూడండి.
Also Read: