Bhuma Akhila Priya: ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియ.. ఎన్నికలపై ఫోకస్.. పార్టీ కార్యకర్తలకు కీలక సూచనలు..
Bhuma Akhila Priya: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టై బెయిల్ పైన విడుదల టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ..
Bhuma Akhila Priya: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టై బెయిల్ పైన విడుదల టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ తొలిసారి ఆళ్లగడ్డకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. కాగా, ఆళ్లగడ్డకు వచ్చిన అఖిల ప్రియ ముందుగా తన తల్లిదండ్రుల ఘాట్‌ను సందర్శించారు. భూమా శోభా నాగిరెడ్డిలకు నివాళులర్పించారు. అనంతరం ఇంటికి వెళ్లారు. అలా వచ్చీ రాగానే ఆమె పంచాయతీ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. కాసేపు వారి మాట్లాడిన అఖిల ప్రియ.. ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆ మేరకు పలు సూచనలు చేశారు.
భూ వివాదం నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లికి చెందిన సునీల్ రావు, అనీల్ రావు, ప్రవీణ్ రావులను భూమా అఖిల ప్రియ అనుచరులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో భూమా అఖిల ప్రియను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలే ఆమెకు సికింద్రాబాద్‌లోని సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Also read:
Republic Day: ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్