Republic Day: ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Republic Day: గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు.

Republic Day: ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 25, 2021 | 8:21 PM

Republic Day: గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఎందరో పోరాట ఫలితమే గణతంత్ర దినోత్సవం అని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం చట్టాలు అమలైన పర్వదినమని.. 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయులందరికీ తన తరఫున, జనసేన శ్రేణుల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. త్యాగధనులు అందించిన ఈ గణతంత్ర రాజ్యాంలో దేశ సమగ్రతను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. జనవరి 26న మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాకలు కారణమైన యోధులను స్మరించుకుందామని ప్రజలకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

Also read:

Nagababu: వరుణ్ తేజ్ వివాహంపై క్లారిటీ ఇచ్చిన నాగబాబు.. ‘ఎవరిని వివాహం చేసుకున్నా పర్లేదు. కానీ’..

Telangana Cop: ఇద్ద‌రు ప్రాణాల‌ను కాపాడిన సీఐకి రాష్ట్ర‌ప‌తి అవార్డు… ప్ర‌క‌టించిన కేంద్ర హోం శాఖ‌…