AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నందమూరి తారక రామారావు అందమైన జ్ఞాపకాలు.. చదువుకునే రోజుల్లో ఎక్కడ ఉండేవారో తెలుసా?

కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించిన నందమూరి తారక రామారావు తెలుగువాడి వాడి వేడి ప్రపంచానికి చూపించారు. ఆయన గుంటూరులోని ఆంధ్రా క్రిస్టియన్ కాలేజ్ లో చదువుకున్నారు. ఆ కాలేజ్ లో చదువుకుంటూ గుంటూరులోని కన్నావారి తోటలోని ఓ ఇంటి రూంలో నివసించేవారు. అప్పటి రోజుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లి రూంలో ఉంటూ చదువుకోవడం అంటే గొప్పే..!

నందమూరి తారక రామారావు అందమైన జ్ఞాపకాలు.. చదువుకునే రోజుల్లో ఎక్కడ ఉండేవారో తెలుసా?
Nandamuri Taraka Rama Rao
T Nagaraju
| Edited By: Balaraju Goud|

Updated on: Oct 25, 2025 | 7:54 PM

Share

కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించిన నందమూరి తారక రామారావు తెలుగువాడి వాడి వేడి ప్రపంచానికి చూపించారు. ఆయన గుంటూరులోని ఆంధ్రా క్రిస్టియన్ కాలేజ్ లో చదువుకున్నారు. ఆ కాలేజ్ లో చదువుకుంటూ గుంటూరులోని కన్నావారి తోటలోని ఓ ఇంటి రూంలో నివసించేవారు. అప్పటి రోజుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లి రూంలో ఉంటూ చదువుకోవడం అంటే గొప్పే..! అలా ఎన్టీఆర్ ఏసీ కాలేజ్ చదువుతూ కన్నావారి తోట రెండో లైన్‌లో ఉన్న ఇంటిలోని రూంలో ఉండేవారు. ఇప్పటికీ ఆ ఇల్లు అలానే ఉంది.

1940లో ఎన్టీఆర్.. ఏసీ కాలేజ్‌లో బిఏ చదివారు. అప్పుడు కన్నా వారి తోటలో ఉన్న ఒక ఇంటిలో పైన ఉన్న ఒక చిన్న గదిలో నివసించేవారు. ఆ ఇంటి నుండి కాలేజ్ కు ప్రతి రోజూ నడిచి వెళ్లి వచ్చేవారని స్థానికులు తెలిపారు. ఎన్టీఆర్ తో పాటు మరో సినీ నటుడు ముక్కామల కూడా ఎన్టీఆర్ తో పాటు ఆ గదిలోనే ఉండేవారట… ఎన్టీఆర్ ఆ రూం బయట ప్రాంగంణలో స్నానం చేసేవారని అక్కడే బుడ్డి దీపం పెట్టుకుని చదివేవారని అనాటి పెద్దలు చెప్పేవారట… ఇప్పటికీ ఆ గది అలానే చెక్కు చెదర కుండా ఉంది. దీంతో కొంతమంది అభిమానులు అప్పుడప్పుడు ఆ గదిని చూడటానికి వస్తుంటారన్నారు స్థానికులు.

ఇక ఆ ఇంటి సమీపంలోనే మరో సినీ నటుడు ఎస్వీ రంగారావు బంధువులు నివసించేవారని అప్పుడప్పుడు ఎస్వీఆర్ కూడా కన్నా వారి తోట వచ్చేవారట.. ఆ జ్నాపకాలను స్థానికులు అప్పుడప్పుడు నెమరు వేసుకుంటుంటారు. ఎన్టీఆర్ డిగ్రీ పూర్తి చేసి చెన్నై వెళ్లి సినీ నటుడిగా ఎదిగిన తర్వాత తాము ఉన్న రూం ఎలా ఉందంటూ స్నేహితులను అడిగేవారని తెలుస్తుంది. ఎనబై ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పటికీ ఆ గది అలానే ఉంది. దీంతో ఆయన అభిమానులు అప్పుడప్పుడు అక్కడికి వచ్చి ఆ గదిని చూసి వెల్తుంటారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి