AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: వైసీపీలో ఇన్‌ఛార్జులను మార్చేస్తున్నారా?.. ఊహించిన రీతిలో ట్విస్ట్ అధిష్టానం..!

Andhra Pradesh: వైసీపీలో ఇన్‌ఛార్జులను మార్చేస్తున్నారా? కొత్త వారిని తెరపైకి తెస్తున్నారా? అంటూ ఈ మధ్య ఈ ప్రచారం బాగా వైరల్‌ అవుతోంది. వాటన్నింటికీ ఫుల్‌స్టాప్‌ పెట్టింది

Andhra Pradesh: వైసీపీలో ఇన్‌ఛార్జులను మార్చేస్తున్నారా?.. ఊహించిన రీతిలో ట్విస్ట్ అధిష్టానం..!
YSRCP
Shiva Prajapati
|

Updated on: Dec 28, 2021 | 9:19 PM

Share

Andhra Pradesh: వైసీపీలో ఇన్‌ఛార్జులను మార్చేస్తున్నారా? కొత్త వారిని తెరపైకి తెస్తున్నారా? అంటూ ఈ మధ్య ఈ ప్రచారం బాగా వైరల్‌ అవుతోంది. వాటన్నింటికీ ఫుల్‌స్టాప్‌ పెట్టింది పార్టీ అధిష్టానం. ఉన్న వారినే కొనసాగిస్తూ అదనపు బాధ్యతలు అప్పగించింది. అ విషయంలో సజ్జల రామకృష్ణా రెడ్డికి, విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి లకు క్లియర్‌ డైరెక్షన్‌ ఇచ్చారట అధినేత జగన్‌. వాస్తవానికి వైసీపీలో ఇన్‌ఛార్జుల నియామకానికి సంబంధించి ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉత్తరాంధ్రకు విజయసాయిరెడ్డి, ఉభయ గోదావరి జిల్లాలకు వైవీ సుబ్బారెడ్డి ఇన్‌ఛార్జులుగా ఉన్నారు. సీమకు సజ్జల కొనసాగుతున్నారు. వీరిలో మార్పులు ఉంటాయని, కొందరికి బాధ్యతలు తీసేస్తారంటూ ఊహాగానాలు కొనసాగాయి.

ఈ నేపథ్యంలోనే ఇన్‌ఛార్జుల అంశంపై అధినేత జగన్‌ దగ్గర చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల దీనిపై నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ ముగ్గురు బాధ్యతల్లో ఎలాంటి మార్పు లేదని వైసీపీ నుంచి అందుతున్న పక్కా సమాచారం. పైగా ఇన్నాళ్లు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి చూస్తున్న ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, మరో ఎంపీ మోపిదేవి చూస్తున్న గుంటూరు, కృష్ణా జిల్లాలను సజ్జలకే అప్పగించినట్లు తెలుస్తోంది.

విశాఖ సిటీతోపాటు ఉత్తరాంధ్ర బాధ్యతల్లో విజయసాయిరెడ్డిని కొనసాగిస్తూ ఢిల్లీలో మరింత ఫోకస్‌ పెట్టాలని అధినేత సూచించినట్లు చెబుతున్నారు. త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండటం, దేశ రాజకీయాల్లో పరిణామాలు, వస్తున్న మార్పులను గమనిస్తూ ఉండాలని, హస్తినలో కార్యకలాపాలపై మరింత ఫోకస్డ్‌గా ఉండాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక వైవీ సుబ్బారెడ్డికి గతంలో మాదిరిగానే ఈస్ట్‌ గోదావరి, వెస్ట్‌ గోదవరితోపాటు చిత్తూరు జిల్లాల ఇన్‌ఛార్జిగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అధినేత దగ్గర జరిగిన తాజా నిర్ణయంతో వైసీపీలో ఇన్‌ఛార్జుల మార్పు ప్రచారానికి తెరపడినట్లయిందని చెబుతున్నాయి పార్టీ వర్గాలు. దీంతో ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, ఢిల్లీలో వ్యవహారాల ఇన్‌ఛార్జిగా విజయసాయి రెడ్డి, ఉభయ గోదావరి, చిత్తూరు జిల్లాలకు వైవీ, మిగిలిన 7 జిల్లాలకు సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్‌ఛార్జిగా కొనసాగుతారు.

Also read:

ID Cards: పెళ్లి తర్వాత అమ్మాయిలు ఏ పత్రాలను మార్చుకోవాలి? ఎందుకు మార్చుకోవాలి? ఇక్కడ తెలుసుకోండి..

Telangana Politics: తెలంగాణ పాలిటిక్స్‌లో మళ్లీ హాట్‌ టాపిక్‌గా మారిన మాజీమంత్రి.. ఆయన చేసి కామెంట్స్ ఏంటంటే..!

Hyderabad: రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన క్యాన్సిల్.. కారణం ఏంటో ఇక్కడ తెలుసుకోండి..

బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?