సచివాలయ ఉద్యోగులకు ముఖ్య అలెర్ట్.. పరీక్షలకు తేదీలు ఖరారు.. నోటిఫికేషన్ విడుదల..
APPSC Notification: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్య అలెర్ట్. డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది...
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్య అలెర్ట్. డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సచివాలయ ఉద్యోగులకు డిపార్ట్‌మెంటల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
ఈ పరీక్షలకు హాజరయ్యే ఉద్యోగులు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. వారు ఓటీపీలో వచ్చే యూజర్ ఐడీతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలంది. ఈ నెల 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉన్నట్లుగా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
కాగా, ఈ పరీక్షలు మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తుండగా.. అందులో 40 మార్కులు వస్తేనే ప్రొబేషనరీకి అర్హత సాధిస్తారని ఎపీపీఎస్సీ తెలిపింది. అక్టోబర్ 2వ తేదీ నాటికి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పడి రెండేళ్లు పూర్తవుతుంది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న15004 గ్రామ,వార్డు సచివాలయాల్లో పని చేస్తోన్న సుమారు1.34 లక్షల మంది ఉద్యోగులకు ప్రభుత్వం డిపార్ట్మెంటల్ పరీక్షలను నిర్వహిస్తోంది.