AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Sharmila: ‘ఏపీకి ప్రత్యేక హోదా ఏమైంది’.. శ్రీకాకుళం పర్యటనలో వైఎస్ షర్మిల..

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాజకీయంగా దూకుడు పెంచారు. ఇచ్చాపురం నుంచి తన యాత్రను చేపడతానన్నారు. అందులో భాగంగా ఇచ్చాపురంలో ప్రజలతో మమేకమయ్యారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పై కేసు పెట్టిందని ఆరోపిస్తున్నారు. కానీ అది నిజం కాదు. వాస్తవం వేరే ఉందన్నారు.

YS Sharmila: 'ఏపీకి ప్రత్యేక హోదా ఏమైంది'.. శ్రీకాకుళం పర్యటనలో వైఎస్ షర్మిల..
Ys Sharmila
Srikar T
|

Updated on: Jan 23, 2024 | 1:48 PM

Share

శ్రీకాకుళం జిల్లా, జనవరి 23: ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాజకీయంగా దూకుడు పెంచారు. ఇచ్చాపురం నుంచి తన యాత్రను చేపడతానన్నారు. అందులో భాగంగా ఇచ్చాపురంలో ప్రజలతో మమేకమయ్యారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పై కేసు పెట్టిందని ఆరోపిస్తున్నారు. కానీ అది నిజం కాదు. వాస్తవం వేరే ఉందన్నారు. సోనియా గాంధీ, రాజశేఖర్ రెడ్డిని ఎంతగా గౌరవిస్తుందో ఆమెను కలిసినప్పుడు నాకు అర్థం అయిందన్నారు. రాజీవ్ గాంధీ చనిపోయాక ఆయన పేరు కూడా సీబీఐ లిస్టులో చేర్చారు అన్నారు. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలిసికూడా రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టగలనా అని తన చేతిలో చేయి పెట్టి కళ్ళల్లోకి చూసి చెప్పారన్నారు. ఇది తెలియక చేసిన పొరపాటు కావచ్చు, తెలిసి చేసింది అయితే కాదన్నారు. ఇది రాజశేఖర్ రెడ్డి రక్తం, రాజశేఖర్ రెడ్డి బిడ్డ చెబుతున్న మాట అని ప్రజలకు తెలియజేశారు.

రాజశేఖర్ రెడ్డి ఏ రోజు బీజేపీ సిద్ధాంతాలతో ఏకీభవించలేదు. ఎందుకంటే బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని ఆరోపించారు. ఈరోజు ఏపీలో జరుగుతున్న పరిస్థితులు గమనిస్తే చాలా బాధాకరంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎమ్మెల్యేలందరూ బీజేపీకి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. అంతే కాకుండా ఆ పార్టీకి బానిసలు అయిపోయారని స్పందించారు. ఏపీ ప్రజలను కూడా ఆ పార్టీకి బానిసలు చేయాలని చూస్తున్నట్లు వివరించారు. ఏపీ ప్రజలు బీజెపికి చెందిన ఒక్క ఎమ్మెల్యేను గాని ఎంపీని గానీ గెలిపించారా అని అడిగారు. కానీ 23 మంది లోక్ సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులందరూ బీజేపీకి బానిసలు అయ్యారని ఘాటుగా స్పందించారు. ఏపీనీ ఈరోజు బీజేపీ ఏలుతోందన్నారు. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరని బీజేపీని జగన్ ఒక్కరోజైనా ప్రశ్నించింది లేదన్నారు. కేంద్రం మెడలు వంచైనా ప్రత్యేక హోదా తెస్తామన్నారు.. మరి ఇచ్చిన హామీ ఏమైంది.. దీనికి సమాధానం చెప్పాలని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ మేలు కోరుకుంటున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు. రాజశేఖర్ రెడ్డి గారి ఆఖరి కోరిక రాహుల్ గాంధీని ప్రధాని చేయడం అని పేర్కొన్నారు. మనసుపెట్టి ప్రజలంతా ఆలోచించండి.. రాజశేఖర్ రెడ్డి బిడ్డను ఆశీర్వదించండని కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మీరు బంగారంపై రుణం తీసుకుంటున్నారా? మీకో భారీ గుడ్‌న్యూస్‌..!
మీరు బంగారంపై రుణం తీసుకుంటున్నారా? మీకో భారీ గుడ్‌న్యూస్‌..!
బ్యాట్‌మ్యాన్‌లా దొంగల వేట,పట్టుకుని స్తంభాలకు కట్టేస్తున్న హీరో?
బ్యాట్‌మ్యాన్‌లా దొంగల వేట,పట్టుకుని స్తంభాలకు కట్టేస్తున్న హీరో?
నల్లమల వెళ్లే పర్యాటకులకు బిగ్ అలర్ట్.. అమ్రాబాద్‌లో టైగర్ సఫారీ
నల్లమల వెళ్లే పర్యాటకులకు బిగ్ అలర్ట్.. అమ్రాబాద్‌లో టైగర్ సఫారీ
పడకగదిలో ప్రియుడితో భార్యను చూసిన భర్త షాక్.. కట్ చేస్తే..!
పడకగదిలో ప్రియుడితో భార్యను చూసిన భర్త షాక్.. కట్ చేస్తే..!
ఓటీటీలో సమంత 'మా ఇంటి బంగారం'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలో సమంత 'మా ఇంటి బంగారం'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
సమంత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తీసిన సన్నివేశాలు ఇవే..
సమంత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తీసిన సన్నివేశాలు ఇవే..
ఇంట్లో పాలు విరిగి పోవటం శాపం కాదు.. అద్భుతమైన వరం..! ఎందుకంటే..
ఇంట్లో పాలు విరిగి పోవటం శాపం కాదు.. అద్భుతమైన వరం..! ఎందుకంటే..
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..