AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది వ్యక్తిగత కక్ష కాదు.. ఆడియో వీడియో సాక్ష్యాలున్నాయి: స్పీకర్ తమ్మినేని

టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై ఉన్న కేసుల్లో తన కుటుంబ సభ్యుల ప్రమేయం లేదన్నారు ఏపీ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం. కూన  రవికుమార్ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దారుణంగా దెబ్బతీసేవిధంగా ప్రవర్తించారనేందుకు ఆడియో,వీడియో సాక్ష్యాలున్నాయన్నారు. అందుకే ఉద్యోగులు కేసు పెట్టారన్నారని తెలిపారు స్పీకర్. కూన రవికుమార్ విషయంలో టీడీపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. గతంలో అచ్చెన్నాయుడు, కూన రవికుమార్‌లు అధికారులను ఎంతగా బెదిరించారో అందరికీ తెలుసునని, ఉద్యోగులన్ని బెదిరించిన చరిత్ర వారిదంటూ మండిపడ్డారు. గత […]

ఇది వ్యక్తిగత కక్ష కాదు.. ఆడియో వీడియో సాక్ష్యాలున్నాయి: స్పీకర్ తమ్మినేని
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 31, 2019 | 4:38 PM

Share

టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై ఉన్న కేసుల్లో తన కుటుంబ సభ్యుల ప్రమేయం లేదన్నారు ఏపీ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం. కూన  రవికుమార్ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దారుణంగా దెబ్బతీసేవిధంగా ప్రవర్తించారనేందుకు ఆడియో,వీడియో సాక్ష్యాలున్నాయన్నారు. అందుకే ఉద్యోగులు కేసు పెట్టారన్నారని తెలిపారు స్పీకర్. కూన రవికుమార్ విషయంలో టీడీపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. గతంలో అచ్చెన్నాయుడు, కూన రవికుమార్‌లు అధికారులను ఎంతగా బెదిరించారో అందరికీ తెలుసునని, ఉద్యోగులన్ని బెదిరించిన చరిత్ర వారిదంటూ మండిపడ్డారు.

గత టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా, టీడీపీ నేతగా ఉన్న కూన రవికుమార్ ఎంపీడీఓ కార్యాలయంలోకి తన అనుచరగణంతో చొరబడి ప్రభుత్వ అధికారులను దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై రవికుమార్‌తో పాటు మరో 11 మందిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఒక్క సారిగ కేసులు నమోదైనప్పటినుంచి రవికుమార్ అఙ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరోవైపు ముందుస్తు బెయిల్ కోసం న్యాయస్ధానాన్ని కూడా ఆశ్రయించినట్టు తెలుస్తోంది. ఆయనకు బెయిల్ మంజూరైతేనే బయటకు వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం కూన రవికుమార్ కేసుల ఘటన తీవ్ర చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా స్పీకర్ తమ్మినేనికి కూన సమీప బంధువు కూడా. అయినప్పటికీ వీరిద్దరిమధ్య ఉన్న రాజకీయ విభేదాలు కాస్తా వ్యక్తిగత వైరాలుగా మారాయనే వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే కూన రవికుమార్‌కు రాజకీయ గురువు స్వయానా తమ్మినేని కావడం గమనార్హం.

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై