AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో కూడా ఎన్ఆర్‌సీ తేవాల్సిందే..

అసోంలో ఎన్‌ఆర్‌సీ తుది జాబితా ఇవాళ విడుదల అయిన విషయ తెలిసిందే. అయితే ఈ జాతీయ పౌర రిజిస్టర్ అంశంపై తెలంగాణ బీజేపీ డిమాండ్ చేస్తోంది. గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నాఆర్సీని తెలంగాణలోనూ అమలు చేయాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరంలో అక్రమంగా ఉంటున్నవారిని గుర్తించేందుకు ఎన్నార్సీ తప్పని సరి అన్నారు. నగరంలో ఇప్పటికే గత కొన్నేళ్లుగా ఇక్కడ బంగ్లాదేశీయులు, మయన్మార్‌కు చెందిన రోహింగ్యా ముస్లింటు అక్రమంగా ఉంటున్నారని […]

తెలంగాణలో కూడా ఎన్ఆర్‌సీ తేవాల్సిందే..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 31, 2019 | 4:05 PM

Share

అసోంలో ఎన్‌ఆర్‌సీ తుది జాబితా ఇవాళ విడుదల అయిన విషయ తెలిసిందే. అయితే ఈ జాతీయ పౌర రిజిస్టర్ అంశంపై తెలంగాణ బీజేపీ డిమాండ్ చేస్తోంది. గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నాఆర్సీని తెలంగాణలోనూ అమలు చేయాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరంలో అక్రమంగా ఉంటున్నవారిని గుర్తించేందుకు ఎన్నార్సీ తప్పని సరి అన్నారు. నగరంలో ఇప్పటికే గత కొన్నేళ్లుగా ఇక్కడ బంగ్లాదేశీయులు, మయన్మార్‌కు చెందిన రోహింగ్యా ముస్లింటు అక్రమంగా ఉంటున్నారని గుర్తు చేశారు. ఈ విషయమై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఆయన ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్లడించారు.

హైదరబాద్ ఎంపీ, తన ఓటు బ్యాంకు కోసం బంగ్లాదేశీయులకు, రోహింగ్యాలకు తెలంగాణలో షెల్టర్ కల్పిస్తున్నారని ట్వీట్‌లో పేర్కొన్నారు. అసోంలో అమలు చేసిన ఎన్‌ఆర్‌సీని తెలంగాణలోనూ అమలు చేయాలని.. తెలంగాణ విమోచన దినమైన సెప్టెంబర్ 17 నుంచి దీనిని అమలు చేయాలని.. తేదీ కూడా చెప్తూ హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేస్తున్నానని రాజాసింగ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ ట్వీట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్‌షాకు ట్యాగ్ చేశారు.

అంతేకాదు మరో బీజేపీ నేత పార్టీ అధికార ప్రతినిధి కె. కృష్ణసాగర్ రావు కూడా స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో అక్రమ వలసదారులు పెరిగిపోతున్నారని, కాబట్టి ఇక్కడ కూడా ఎన్ఆర్సీని రూపొందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అక్రమ వలసదారుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోందని.. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో అక్రమ వలసదారులు ఎక్కువయ్యారన్నారు. తెలంగాణ పోలీసుల లెక్కలు మాత్రం రాష్ట్రంలో 5000 మంది రోహింగ్యాలు ఉన్నట్టు చెబుతున్నా, వాస్తవానికి లక్ష మందికి పైగా రోహింగ్యాలు ఉన్నారని ఆరోపించారు. వీరిని ఎంఐఎం తమ ఓట్ బ్యాంక్‌గా వాడుకుంటోందని ఆరోపించారు. ఈ అక్రమ వలసవాదుల సమస్య టైం బాంబ్ లాంటిదంటూ పేర్కొన్నారు. కాబట్టి తెలంగాణలో కూడా జాతీయ పౌరపట్టికను తయారు చేయాలని కృష్ణ సాగర్ రావు డిమాండ్ చేశారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలసి ఫిర్యాదు కూడా చేస్తామన్నారు.

కాగా దేశవ్యాప్తంగా ఉన్న అక్రమ చొరబాటుదారులను దేశం నుంచి తరిమివేసేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. గత ఏడాది సెప్టెంబరులో హైదరాబాద్ ను విజిట్ చేసిన సందర్భంలోనూ ఆయన నగరంలోని అక్రమ బంగ్లాదేశీయులను పంపివేసేందుకు ఎన్నార్సీ వంటి ప్రక్రియ అవసరమని పేర్కొన్నారు.

తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!