మరో ట్విస్ట్.. పరిషత్ ఎన్నికలపై హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్‌కు వెళ్లిన ఎస్ఈసీ

ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికలు నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్‌ఈసీ నొటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించింది.

  • Ram Naramaneni
  • Publish Date - 5:53 pm, Tue, 6 April 21
మరో ట్విస్ట్.. పరిషత్ ఎన్నికలపై హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్‌కు వెళ్లిన ఎస్ఈసీ
Neelam Sahni

AP MPTC ZPTC Polls 2021: ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికలు నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్‌ఈసీ నొటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించింది. ఈ  క్రమంలో సింగిల్ జడ్జి వెలువరించిన తీర్పుపై  డివిజన్ బెంచ్‌ను రాష్ట్ర ఎన్నికల‌ కమిషన్ హైకోర్టును ఆశ్రయించింది. డివిజన్ బెంచ్‌లో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.  సింగిల్ జడ్జి తీర్పుపై అత్యవసరంగా విచారించాలని ఎస్‌ఈసీ కోరారు. దీనిపై ఈ రోజు రాత్రి విచారించే అవకాశం ఉంది.

సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు ఏంటి..?

పరిషత్‌ ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిలిపివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.  పోలింగ్‌కు నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ అమలు కావాలంటూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల అమలు కాేలదని పేర్కొంది. టీడీపీ, బీజేపీ, జనసేన, మరికొందరి పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

కోడ్‌ విషయంలో 4 వారాల గడువు నిబంధన పాటించలేదని పిటిషనర్లు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు అమలు కాకపోవటం సరికాదని విన్నవించారు. ఎస్ఈసీ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేలా ఆదేశించాలని కోరారు. నోటిఫికేషన్ తర్వాత కొంత సమయం ఉండాలని పిటిషనర్లు కోరారు. తక్కువ సమయంలో ఏర్పాట్లు చేసుకోలేమని వివరించారు. ప్రచారం కోసం నెల గడువు ఉండాలని పేర్కొన్నారు. ఇది కొత్త నోటిఫికేషన్‌ కాదని ఎస్‌ఈసీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆగిపోయిన ప్రక్రియను కొనసాగిస్తున్నామని కోర్టుకు విన్నవించారు. వాదనలు విన్న కోర్టు.. ఎస్‌ఈసీ నొటిఫికేషన్‌పై స్టే విధించింది.

Also Read: ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికలకు బ్రేక్.. ఎస్‌ఈసీ నొటిఫికేషన్‌పై హైకోర్టు స్టే

ఆంధ్రాలో ప్రమాదకరంగా కరోనా వ్యాప్తి.. కొత్తగా నమోదైన కేసులు, మరణాల వివరాలు