Andhra Pradesh: ఏపీ టెన్త్ ఫలితాల వివాదంలో మరో ట్విస్ట్.. అసలు ఆ ఫలితాలన్నీ ఫేకే అంటూ..
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ ఫలితాలన్నీ ఫేకేనా..? కార్పొరేట్ విద్యాసంస్థలు రిజల్ట్స్‌ను ప్రభావితం చేస్తున్నాయా? ..
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ ఫలితాలన్నీ ఫేకేనా..? కార్పొరేట్ విద్యాసంస్థలు రిజల్ట్స్‌ను ప్రభావితం చేస్తున్నాయా? 2002 తర్వాత టెన్త్ చదివిన వాళ్లంతా రియల్‌గా పాస్ అవనట్టేనా..? ఇవీ ఏపీలో పదో తరగతి ఫలితాలపై వస్తున్న కొత్త అనుమానాలు.. ఆరోపణలు. ఇంతకీ ఈ సరికొత్త ప్రశ్నలకు అసలైన సమాధానం ఏంటి? ఈ ప్రత్యేక స్టోరీ తెలుసుకకుందాం..
ఏపీలో టెన్త్ ఫలితాల వివాదం మరో మలుపు తిరిగింది. ఇప్పుడు వచ్చిన ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే.. ఇప్పుడు సరికొత్త ఆరోపణలతో అసలు టెన్త్ క్లాస్ ఫలితమే పెద్ద ప్రశ్నగా మారింది. టీవీ9 బిగ్ డిబేట్ వేదికగా.. టెన్త్ ఫలితాలపై సంచలన ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఇప్పటి వరకూ వచ్చిన ఫలితాల్లో 90శాతం ఫేక్ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు ఏపీ స్కూల్ రెగ్యులేటరీ కమిషన్ సీఈవో సాంబశివారెడ్డి.
కార్పొరేట్ విద్యాసంస్థల ఒత్తిడితో.. గత 20 సంవత్సరాలుగా ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారు ఏపీ స్కూల్ రెగ్యులేటరీ కమిషన్ సీఈవో సాంబశివారెడ్డి. ఇంత శాతం మంది విద్యార్ధులు పాసవ్వాలని ముందే అధికారులకు ఆదేశాలు వెళ్లేవనీ.. దాని ప్రకారమే ఫైనల్ రిజల్ట్స్ వచ్చేవనేది ఆయన చేస్తున్న ఆరోపణ.
ఇప్పటి వరకూ జరిగిన టెన్త్ క్లాస్ పరీక్షల్లో 30 మార్కులకు బిట్ పేపర్ ఉండేది. కానీ ఈ ఏడాది బిట్ పేపర్ తొలగించారు. ఇది కూడా ఫలితాలపై ప్రభావం చూపిందన్నారు పీఆర్‌టియూ ఏపీ ప్రెసిడెంట్ గిరిప్రసాద్. ఇప్పటి వరకూ ఎలా రాసినా పాస్ అవుతామనే నిర్లక్ష్యం ఉండేది. ఇక నుంచి ఖచ్చితంగా చదివితేనే పాస్ అవుతామనే ఆలోచలోకి విద్యార్ధులు వచ్చారని, ఇది మంచి పరిణామమని అభిప్రాయపడ్డారాయన.
కాపీయింగ్ చేయిస్తే.. 90 శాతం ఏంటి, 100శాతం మందీ పాస్ అవుతారన్నారు విద్యాశాఖ మంత్రి బొత్స. అలాంటి ఫలితాలనే ప్రజలు కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. మంచి విద్యను అందించి.. విద్యార్ధులను ప్రతిభా వంతులుగా తయారు చేయడమే తమ ప్రభుత్వ ఉద్ధేశమన్నారు. కరోనా కారణంగా రెండేళ్లు పరీక్షలే జరగలేదు. ఇప్పుడు ఏదో కష్టపడి పరీక్ష రాస్తే.. అవి కాస్తా పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. ఇంతకీ ఏపీలో ఫలితాలు ఫేకా.. లేక ఆరోపణలు ఫేకా అనేది కాలమే చెబుతుంది.