Bheemla Nayak: నిర్మాతలకు మద్దతుగా థియేటర్ల ముందు పవన్ ఫ్యాన్స్ హుండీలు ఏర్పాటు.. విరాళాల సేకరణ

Bheemla Nayak: ఆంధ్రప్రదేశ్‌(Andhrapradesh)లో చలనచిత్ర వాణిజ్య పనితీరును నియంత్రించడానికి ఏపీ ప్రభుత్వం కొన్ని కొత్త G.O లను తీసుకువచ్చింది. ఇప్పుడు ఏపీలోని ' భీమ్లా నాయక్ ' రిలీజ్ అయ్యే థియేటర్లపై నిఘా పెంచింది..

Bheemla Nayak: నిర్మాతలకు మద్దతుగా థియేటర్ల ముందు పవన్ ఫ్యాన్స్ హుండీలు ఏర్పాటు.. విరాళాల సేకరణ
Pawan Fans
Follow us
Surya Kala

|

Updated on: Feb 25, 2022 | 5:33 PM

Bheemla Nayak: ఆంధ్రప్రదేశ్‌(Andhrapradesh)లో చలనచిత్ర వాణిజ్య పనితీరును నియంత్రించడానికి ఏపీ ప్రభుత్వం కొన్ని కొత్త G.O లను తీసుకువచ్చింది. ఇప్పుడు ఏపీలోని ‘ భీమ్లా నాయక్ ‘ రిలీజ్ అయ్యే థియేటర్లపై నిఘా పెంచింది. టికెట్ ధరలు(Ticket Cost), అదనపు షో(Benefit shows)ల విషయంలో ఇప్పటికే థియేటర్స్ యాజమాన్యానికి ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఓ అడుగు ముందుకు వేసి.. ‘భీమ్లా నాయక్’ నిర్మాతలకు మద్దతు ఇవ్వడాని.. సినిమాను తీసుకున్న ఎగ్జిబిటర్స్ నష్టపోకుండా విరాళాలు సేకరించడానికి థియేటర్ల ముందు హుండీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. అయితే పవర్ స్టార్ ఫ్యాన్స్‌ని ఢీకొట్టేందుకు కొంతమంది ఇతర పార్టీ నేతలు ముందుగానే థియేటర్ల నుంచి టిక్కెట్లు కొనుక్కుని తమకు అందకుండా చేస్తున్నారని పవన్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డిస్ట్రిబ్యూటర్లను నష్టాల కొంతైనా గట్టెక్కించేందుకు గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పవన్ అభిమానులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. థియేటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు వచ్చే నష్టాల నుంచి వారిని ఆదుకోవడానికి మాచర్లలోని  నాగార్జున కళామందిర్ థియేటర్లో డిస్ట్రిబ్యూటర్ల కోసం  విరాళాల సేకరణకు హుండీ ఏర్పాటు చేశారు.  రూ.70, 50,30..టికెట్ రేట్లుగా ఫిక్స్ చేశారని, ఆ రేట్ల ప్రకారం అయితే డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు వస్తాయని మాచర్ల పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు వాపోతున్నారు. అందుకే వారికోసం హుండీ ఏర్పాటు చేశామని చెప్పారు. అంతేకాదు.. ఏపీలో ధరలు ఇలాగే తక్కువగానే ఉంటె.. తాము ఒకటికి నాలుగు సార్లు సినిమా చూసి కలెక్షన్లు పెంచుతామని చెబుతున్నారు.

ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్న స్పెషల్ షోలు/ఫ్యాన్స్ షోల ప్రదర్శనను కూడా ఏపీ సర్కార్ నిలిపివేసింది. అంతేకాకుండా, వారు థియేటర్లలో అదనపు సీట్లు/కుర్చీలు జోడించడానికి కూడా అనుమతించలేదు.  తాము జారీ చేసిన అన్ని ఆదేశాలను పాటిస్తున్నారో లేదో తనిఖీ చేయడానికి ప్రభుత్వం కొంతమంది అధికారులను కూడా నియమించింది.

ఏపీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, ‘భీమ్లా నాయక్’ సినిమా టిక్కెట్లను పాత ధరలకు మాత్రమే అమ్మాల్సి ఉంటుంది. అయితే ఈ ధరలకు సినిమా ను ప్రదర్శిస్తే.. సినిమా థియేటర్ యజమానులు, పంపిణీదారులు, కొనుగోలుదారులు భారీ నష్టం ఏర్పడుతుంది. AP ప్రభుత్వం నిబంధనలతో , థియేటర్ యజమానులు, ఎగ్జిబిటర్లు సినిమాపై పెట్టుబడి పెట్టిన డబ్బును తిరిగి పొందేందుకు మార్గం లేదు. రాష్ట్రంలో తమ రాజకీయ ప్రత్యర్థులను ఆర్థికంగా బలహీనపరిచేందుకు ఉద్దేశ్యపూర్వకంగానే ప్రభుత్వం పైన పేర్కొన్న నిబంధనలు తీసుకొచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా నిర్మాతలను నియంత్రించడానికి AP ప్రభుత్వం తీసుకున్న చర్య రాజ్యాంగ విరుద్ధమని స్థానిక ఎగ్జిబిటర్లు అంటున్నారు.

మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలోని కేంద్రపాలిత ప్రాంతం యానంలో భీమ్లా నాయక్ సినిమా విడుదలైన రెండు థియేటర్లలో ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతిస్తూ సబ్‌ డివిజినల్‌ మేజిస్టేట్‌ అమన్‌ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read:  భీమ్లా నాయక్‌పై రాజకీయం చేస్తున్నారు.. చంద్రబాబుపై మంత్రి పేర్ని నాని ఫైర్