Andhra Pradesh: ఇక్కడ ఢీకొట్టాడు.. మహారాష్ట్రలో తేలాడు.. ఆ గంజాయ్ వాహనం మిస్టరీ వీడింది..

AP Paderu police: ఏఓబి నుంచి గంజాయి గుట్టుగా తరలిస్తూ.. రోడ్డు ప్రమాదంతో కారు వదిలి పరారైన కేసులో నిందితుడు ఎట్టకేలకు చిక్కాడు. మహారాష్ట్రకు చెందిన ఇంటర్ స్టేట్ గంజాయి స్మగ్లర్ ఫిరోజ్ అజీజ్ ను పాడేరు పోలీసులు పట్టుకున్నారు.

Andhra Pradesh: ఇక్కడ ఢీకొట్టాడు.. మహారాష్ట్రలో తేలాడు.. ఆ గంజాయ్ వాహనం మిస్టరీ వీడింది..
Paderu Police

Edited By:

Updated on: Jul 10, 2023 | 5:36 AM

AP Paderu police: ఏఓబి నుంచి గంజాయి గుట్టుగా తరలిస్తూ.. రోడ్డు ప్రమాదంతో కారు వదిలి పరారైన కేసులో నిందితుడు ఎట్టకేలకు చిక్కాడు. మహారాష్ట్రకు చెందిన ఇంటర్ స్టేట్ గంజాయి స్మగ్లర్ ఫిరోజ్ అజీజ్ ను పాడేరు పోలీసులు పట్టుకున్నారు. అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు. అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో జూన్ 25న రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీని ఢీకొంది xuv కారు. ఢీకోట్టిన తరువాత కారు వదిలి పరారయ్యారు దుండగులు. వాహనంలో భారీగా గంజాయి ఉంది. పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మోదకొండమ్మ పాదాలు వద్ద ఆరోజు తెల్లవారుజామున ఘటన జరిగింది.

గంజాయి లోడుతో వెళ్తున్న కారు.. ఆయిల్ ట్యాంకర్ ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు ధ్వంసం అయింది. అందులో ఉన్న 400 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ ఫేక్ నెంబర్ ప్లేట్ తో ఆ కారు ఉంది.. నిందితులు లేకపోవడంతో ఎవరు కొన్నారు..? ఎక్కడి నుండి వచ్చిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు.

చివరకు దీని వెనక ఇంటర్ స్టేట్ గంజాయి స్మగ్లర్ ఉన్నట్టు గుర్తించారు. చివరకు మహారాష్ట్రకు చెందిన ఫిరోజ్ అజీజ్ ను పోలీసులు పట్టుకున్నారు. అరెస్టు చేసి కోర్టు ఆదేశాలతో రిమాండ్ కు తరలించారు. ఏఓబి నుంచి గంజాయి తీసుకొచ్చి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్టు గుర్తించి.. తనిఖీలను ముమ్మరం చేసినట్లు పాడేరు సిఐ సుధాకర్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..