AP Night Watchmen Jobs: ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో 5,388 నైట్ వాచ్‌మెన్ పోస్టులు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో నైట్ వాచ్‌మెన్ పోస్టుల నియామకానికి కేబినేట్ ఆమోదించింది. దీనిలో భాగంగా 5,388 పోస్టులను భర్తీ చేయనున్నట్లు సోమవారం (మార్చి 20) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులకు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో నైట్ వాచ్‌మెన్ పోస్టుల నియామకానికి కేబినేట్ ఆమోదించింది. దీనిలో భాగంగా 5,388 పోస్టులను భర్తీ చేయనున్నట్లు సోమవారం (మార్చి 20) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులకు రూ 6,000ల గౌరవ వేతనాన్ని ఇవ్వనున్నట్లు ఉత్వర్వుల్లో పేర్కొంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే జారీకానుంది. నేడు-నేడూ కింద పాఠశాలల్లో ఇప్పటికే అయాలుగా పనిచేస్తున్న మహిళల భర్తకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. గ్రామ/వార్డులో మాజీ-సేవా పురుషులకు రెండో ప్రాధాన్యత ఇస్తారు. ఈ రెండు విభాగాలకు సంబంధించినవారు లేనిపక్షలో పేరెంట్స్ కమిటీ సూచనల మేరకు అర్హత గల వ్యక్తిని నియమించుకునే అవకాశం కల్పించింది. పోస్టుల నియామకంలో స్కూల్ ఎడ్యుకేషన్ కమీషనర్, మిడ్ డే మీల్స్ డైరెక్టర్ తదుపరి అవసరమైన చర్యలను తీసుకుంటారు.
ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలల అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మన బడి నాడు-నేడు పథకం కింద పాఠశాలల్లో నీళ్ల సదుపాయం, మరుగుదొడ్లు, తాగునీటి సరఫరా, తరగతి గదుల్లో ఫ్యాన్లు, ట్యూబ్ లైట్ల ఏర్పాటు, విద్యార్థులు, సిబ్బందికి ఫర్నిచర్ ఏర్పాటు, గ్రీన్ చాక్ బోర్డు, పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబులు, స్కూల్ కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్‌లు, అదనపు తరగతి గదులు ఏర్పాటు చేసింది. మరుగుదొడ్ల నిర్వహణ నిధి పథకం కింద అన్ని పాఠశాలలకు పారిశుద్ధ్య కార్మికుల ఆయాలను నియమించడమే కాకుండా క్లీనింగ్ కెమికల్స్, క్లీనింగ్ టూల్స్, ఇంటరాక్టివ్ ప్యానెల్‌లు, స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశారు. అలాగే విద్యార్థులకు ట్యాబ్‌లు కూడా అందజేశారు. ఈ క్రమంలో కొన్ని పాఠశాలల్లో దొంగతనాలు జరుగుతున్నాయని, నాడు నేడు కింద అందించిన పాఠశాలల్లోని విలువైన వస్తువులు చోరీకి గురవుతున్నాయని ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. పాఠశాలల్లో విలువైన వస్తువుల పరిరక్షణకు ప్రభుత్వం నైట్ వాచ్‌మెన్ పోస్టుల నియామకాలకు మొత్తం 5,388 హైస్కూల్‌లలో నైట్ వాచ్‌మెన్‌లను నియమించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.