Big News Big Debate: ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత బీజేపీ, జనసేన మాటలయుద్ధం.. మారనున్న పొలిటికల్ కథా చిత్రం.. లైవ్ వీడియో
బీజేపీ, జనసేన మధ్య చెడినట్టే కనిపిస్తోంది. పొత్తులున్నా తమతో కలిసి జనసేన పనిచేయకపోవడంపై బీజేపీ అసంతృప్తిగా ఉంది.
బీజేపీ, జనసేన మధ్య చెడినట్టే కనిపిస్తోంది. పొత్తులున్నా తమతో కలిసి జనసేన పనిచేయకపోవడంపై బీజేపీ అసంతృప్తిగా ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాయమడిగినా చేయలేదని జనసేనపై విమర్శలు సంధిస్తున్నారు బీజేపీ నేతలు. బీజేపీ పదాధికారుల సమావేశం తర్వాత ఆ పార్టీ నేత మాధవ్ చేసిన హాట్ కామెంట్స్.. కాకరేపుతున్నాయ్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సపోర్ట్ కోసం పవన్‌ని అడిగామనీ… జనసేన నుంచి ఎలాంటి స్పందనా రాలేదనీ చెప్పారు మాధవ్. పొత్తుల విషయంలో చాలా ఆలోచలున్నాయనీ… బీజేపీ ఏపీలో సొంతంగా ఎదగాలనుకుంటోందనీ చెప్పారు. ఏపీ బీజేపీలో కీలకనేతగా ఉన్న మాధవ్ వ్యాఖ్యలతో.. ఈ రెండు పార్టీలు బ్రేకప్ చెప్పేసుకుంటున్నాయనే చర్చ మొదలైందిప్పుడు.
Published on: Mar 21, 2023 07:02 PM
వైరల్ వీడియోలు
Latest Videos