Andhra Pradesh: కొండకోనల్లో డ్రోన్ల చక్కర్లు.. ఎందుకో తెలుసా? అలా చేస్తే ఇకపై జైలుకే..

అల్లూరి జిల్లా ఏజెన్సీలో మాయని మచ్చగా మారిన గంజాయిపై పోలీసులు యుద్ధమే ప్రకటించారు. సరికొత్త యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. అందుకోసం ఇప్పటికే పాత గంజాయి కేసుల్లో పట్టుబడిన వారు, గంజాయి పంటను సాగు చేసే వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. గంజాయి పంటనుంచి దూరం చేసేలా రైతులను మోటివేట్ చేయడం ద్వారా గంజాయికి దాదాపుగా బ్రేక్ వేయవచ్చనేది పోలీసుల భావన. ఇప్పటికే ప్రత్యామ్నాయ పంటల వైపు దారి చూపిన పోలీసులు, అధికారులు.. చాలా వరకు గంజాయి..

Andhra Pradesh: కొండకోనల్లో డ్రోన్ల చక్కర్లు.. ఎందుకో తెలుసా? అలా చేస్తే ఇకపై జైలుకే..
Cannabis Cultivation Alluri Sitaramaraju District
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Srilakshmi C

Updated on: Oct 11, 2023 | 6:28 PM

అల్లూరి ఏజెన్సీ, అక్టోబర్ 11: అల్లూరి జిల్లా ఏజెన్సీలో మాయని మచ్చగా మారిన గంజాయిపై పోలీసులు యుద్ధమే ప్రకటించారు. సరికొత్త యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. అందుకోసం ఇప్పటికే పాత గంజాయి కేసుల్లో పట్టుబడిన వారు, గంజాయి పంటను సాగు చేసే వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. గంజాయి పంటనుంచి దూరం చేసేలా రైతులను మోటివేట్ చేయడం ద్వారా గంజాయికి దాదాపుగా బ్రేక్ వేయవచ్చనేది పోలీసుల భావన. ఇప్పటికే ప్రత్యామ్నాయ పంటల వైపు దారి చూపిన పోలీసులు, అధికారులు.. చాలా వరకు గంజాయి సాగును కంట్రోల్ చేసేసారు. కానీ ఇంకా ఎక్కడో అక్రమార్కుల మాటల్లో పడి.. గిరిజనులు మారుమూల ప్రాంతాల్లో సాగు చేస్తున్నట్టు పోలీసులకు అప్పగించింది. దీంతో ఇక అధునాతన డ్రోన్లను రంగంలోకి దింపారు. కొండలు లోయలో మధ్య గుట్టుగా సాగుతున్న గంజాయి వ్యవహారాన్ని గుర్తిస్తున్నారు. వంటను సాగు చేస్తున్న వారిపై ఇకనుంచి యాక్షన్ మామూలుగా లేదు మరి..!

ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీలోని 11 మండలాలతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏజెన్సీ 11 మండలాలు కలిపి అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పడింది. అయితే ఏజెన్సీలో ప్రధాన సమస్య గంజాయి. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో ఈ గంజాయి ఏపుగా పెరుగుతుంది అనేది నిత్య సత్యం. ఏపీ బోర్డర్లో చాలావరకు గంజాయి సాగు తగ్గిన, ఒడిస్సా సరిహద్దుల్లో మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి తోడు అంతరాష్ట్ర స్మగ్లర్లు అల్లూరి మన్యంలో పండే గంజాయి కన్నేసి గిరిజనులకు మాయమాటలతో మచ్చిక చేసుకుని కోట్ల రూపాయల గంజాయిని తరలించిపోయేవారు.

గంజాయి యాక్షన్ ప్లాన్..

అల్లూరి ఏజెన్సీ వ్యాప్తంగా ఆపరేషన్ గంజాయి సరికొత్త యాక్షన్ ప్లాన్ ను అమలు చేస్తున్నారు పోలీసులు. గంజాయి రవాణా సాగు చేస్తు 10 ఏళ్లుగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో గంజాయి కేసులు నమోదైన వారిపై బైండోవర్ చేస్తున్నరు పోలీసులు. ఇలా ఏజెన్సీ వ్యాప్తంగా 250 మందికి పైగా వరకు బైండోవర్లు చేశారు. ఇకముందు గంజాయి కేసులో పట్టుపడితే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కట్.. రెండు లక్షల వరకు జరిమానా అని సూచనలు జారీ చేస్తూ.. బైండోవర్లు కూడా చేశారు. ప్రభుత్వ పథకాలు దూరమవడంతో పాటు.. రెండు లక్షలు తిరిగి చెల్లించాలని సూచనలు కూడా జారీ చేశారు పోలీసులు. ఒకానొక దశలో ఈ గంజాయి మాకొద్దు బాబు అంటూ గిరిజనులు ప్రతిన పూనేలా చేశారు. అయినా మళ్లీ మారుమూల ప్రాంతాల్లో గంజాయి మూలాలు కలవర పాటుకు గురిచేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

రంగంలోకి అధునాతన డ్రోన్లు..

అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో గంజాయి సాగు పై డ్రోన్లతో నిఘా పెట్టారు. కొండలు గుట్టలు లోయల మాటున దాగి ఉన్న గంజాయిని ప్రత్యేకంగా డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నరు పోలీసులు. ఎస్పి తుహిన్ సిన్హా ఆదేశాలతో… రంగంలోకి స్వయంగా పాడేరు ఏఎస్పీ ధీరజ్, సిఐ సుధాకర్ దిగారు. స్థానిక సచివాలయ సిబ్బంది సహకారంతో.. కొండల మాటున లోయల్లో గంజాయి సాగు జరిగితున్నట్టు గుర్తించ్చారు. 8 చోట్ల గంజాయి పంట వేసినట్టు గుర్తించి.. పాడేరు, హుకుంపేట మండలాల్లో 9 మందిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

ఆ సాగు ఎక్కడెక్కడంటే..!

పాడేరు, హుకుంపేట మండలాల్లో అధునాతమైన డ్రోన్లు సహాయం తో కొండ మూలల్లో ఉన్న గంజాయిని గుర్తించి గంజాయి పంట వేసిన వారిని అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పాడేరు, హుకుంపేట మండలాల్లో 8 కేసులు నమోదు చేసి తొమ్మిది మంది పంట వేసిన వారిని అరెస్టు చేశారు. ఇందులో పాడేరు కించూరు పంచాయతీ బోంగజంగి లో ఒక కేసు, తొట్లగొందిలో ఒక కేసు, ఇరాడపల్లి పంచాయతీ సరియపల్లి లో ఒక కేసు గంజాయి రైతుల పైన నమోదు చేశారు. అలాగే హుకుంపేట మండలం లో తీగలవలస పంచాయతి ఒలుబెడ్డ గ్రామంలో రెండు కేసులు , మత్యపురం పంచాయతీ పెడబోరుగుల గ్రామంలో రెండు కేసులు , గన్నేరుపుట్టు పంచాయతీ పోర్లు గ్రామం లో ఒక కేసు నమోదు అయ్యాయి. జీవితాల్ని నాశనం చేసే గంజాయి పంటకు గిరిజనులు దూరంగా ఉండాలని, లేకుంటే రైతుల పైన పోలిసు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తామని అంటున్నారు పోలీసులు.

అయితే పోలీసులకు ఎన్ఫోర్స్మెంట్ వర్గాలకు పట్టుబడుతున్న వారు గిరిజనులే అయినప్పటికీ.. దీని వెనుక అంతర్రాష్ట్ర ముఠామే పని చేస్తున్నాయి అన్నది నిఘా వర్గాల సమాచారం. అయినప్పటికీ.. గంజాయిని సాగులోనే తుంచేస్తే.. సరిహద్దులో దాటదనేది పోలీసుల భావన. అందుకే ఇప్పటివరకు గంజాయి సాగు చేస్తున్న రైతులు, స్మగ్లర్లకు సహకారం అందిస్తున్న గిరిజనులను మోటివేట్ చేస్తూ కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూపించారు పోలీసులు. గంజాయి కి దూరంగా ఉండాలని చాలాసార్లు సూచించారు. అయినాప్పటికీ.. గుట్టుగా కొండలలోయాల మధ్య గంజాయి సాగు చేస్తున్న వారిపై ఇక కఠిన చర్యలకు ఉపక్రమించారు పోలీసులు. ఆల్లూరి మన్యానికి మాయని మచ్చగా మారిన గంజాయి సాగును పూర్తిగా నియంత్రించి గంజాయి ఫ్రీ ఏజెన్సీగా చేసేందుకు సహకరించాలని కోరుతున్నారు పోలీసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.