AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Python: ఆకలి తీర్చుకునేందుకు వచ్చింది.. ఆఖరికి హతమయ్యింది…

ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల వసంత నగర్ కాలనీలో ఓ మేకల కాపరి తన మందతో కలిసి జీవిస్తున్నాడు. తన మేకల మందలను కాలనీ శివారులో ఉన్న పచ్చికబయళ్ళలో మేపుతూ ఉంటాడు. ప్రతిరోజు లాగానే బుధవారం కూడా తన మేకల మందలను తోలుకొని పచ్చిక బయళ్ళ వద్దకు వెళ్ళాడు. అయితే ఆ మేకల మంద అక్కడే తిరుగుతూ మేతమేస్తున్నాయి. ఈలోగా...

Python: ఆకలి తీర్చుకునేందుకు వచ్చింది.. ఆఖరికి హతమయ్యింది...
Python
B Ravi Kumar
| Edited By: |

Updated on: Oct 11, 2023 | 5:56 PM

Share

సింహం పరిగెత్తించి, వేటాడి, వెంటపడి చంపుతుంది. అదే కొండచిలువ ఉక్కిరిబిక్కిరి చేసి, కండరాలను బిగపట్టి, దాని శరీరానికి చిక్కిన ప్రాణికి ఎముకలు విరిగిపోయేలా మెలిపెట్టి చంపేస్తుంది. తర్వాత దాన్ని ఏకమొత్తంగా మింగేస్తుంది. తాజాగా ఆకలితో వచ్చిన కొండచిలువ మేకను చుట్టేసింది. కానీ స్ధానికులు కంటబడి ప్రాణాలు పోగొట్టుకుంది. ఏలూరు జిల్లాలో జరిగింది ఈఘటన.  ఓ భారీ కొండచిలువ ఆహారం కోసం వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. స్థానికుల కంటబడటంతో కర్రలు, గుణపాలతో దాన్ని కొట్టి చంపారు. అది చనిపోవటంతో అక్కడ నివసిస్తున్న స్థానికులు సైతం ఊపిరి పీల్చుకున్నారు. కొండచిలువ కారణంగా ఓ మేకల కాపరికి నష్టంవాటిల్లింది. ఇంతకీ ఆ కొండచిలువ దేన్నీ ఆహారంగా తీసుకోవడానికి వెళ్ళింది. ఎందుకు దాని ప్రాణాలు పోగొట్టుకుంది. ఆ కాపరికి జరిగిన నష్టం ఏమిటి.. ఇప్పుడు తెలుసుకుందాం.

ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల వసంత నగర్ కాలనీలో ఓ మేకల కాపరి తన మందతో కలిసి జీవిస్తున్నాడు. తన మేకల మందలను కాలనీ శివారులో ఉన్న పచ్చికబయళ్ళలో మేపుతూ ఉంటాడు. ప్రతిరోజు లాగానే బుధవారం కూడా తన మేకల మందలను తోలుకొని పచ్చిక బయళ్ళ వద్దకు వెళ్ళాడు. అయితే ఆ మేకల మంద అక్కడే తిరుగుతూ మేతమేస్తున్నాయి. ఈలోగా అక్కడే పొదలలో దాగివున్న ఓ భారీ కొండచిలువ మేకల మందల రాకని గమనించింది. తనకు ఆహారం దొరికిందని సంతోషించింది. కళ్ళెదుటే ఉన్న మందలో ఓ మేకను పట్టుకొని తన శరీరంతో గట్టిగా చుట్టుకుని ఆ మేకను ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఇంకేముంది ఇక హాయిగా చంపిన మేకను ఆరగించడానికి సిద్ధమైంది. చనిపోయిన మేకను తన నోటితో మెల్లగా మింగడం ప్రారంభించింది. అయితే తోటి మేక చనిపోవడంతో మందలోని ఇతర మేకలు భయంతో బిగ్గరగా అరవడం మొదలెట్టాయి. మేకల అరుపులు విన్న ఆ కాపరి ఎందుకు అరుస్తున్నాయా అని వాటి వద్దకు వచ్చి చూసి షాక్ కి గురయ్యాడు. ఆ దృశ్యం చూడగానే కాపరికి భయంతో ఒళ్లంతా చెమటలు పట్టాయి. దాంతో బిగ్గరగా కేకలు వేశాడు. కాపరి కేకలు విన్న స్థానిక యువకులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే కర్రలు, ఇనుప గుణపాల సహాయంతో కొండచిలువను కొట్టి చంపారు.

అయితే తనకు జీవనోపాధి అయిన మేక చనిపోవడంతో కాపరి కి నష్టం జరిగింది. మరో పక్క భారీ కొండచిలువ హతమవడంతో చుట్టుపక్కల స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కొత్త సంవత్సరంలో వారికి ప్రేమ, పెళ్లి ప్రయత్నాల్లో విజయం!
కొత్త సంవత్సరంలో వారికి ప్రేమ, పెళ్లి ప్రయత్నాల్లో విజయం!
కియారా అద్వానీకి కలిసి రాని టాలీవుడ్..
కియారా అద్వానీకి కలిసి రాని టాలీవుడ్..
పొలం గట్లపై వింత ముద్రలు.. ఆ గ్రామంలో క్షణక్షణం భయం భయం!
పొలం గట్లపై వింత ముద్రలు.. ఆ గ్రామంలో క్షణక్షణం భయం భయం!
75 బంతుల్లో సెలెక్టర్లకు ఇచ్చిపడేసిన టీమిండియా బ్యాడ్ లక్కోడు..
75 బంతుల్లో సెలెక్టర్లకు ఇచ్చిపడేసిన టీమిండియా బ్యాడ్ లక్కోడు..
న్యూ ఇయర్ స్పెషల్ విషెస్ చెప్పాలా..? హెల్మెట్ బొకేలు ట్రై చేయండి
న్యూ ఇయర్ స్పెషల్ విషెస్ చెప్పాలా..? హెల్మెట్ బొకేలు ట్రై చేయండి
Late Night Sleep: రాత్రి నిద్ర ఆలస్యం చేస్తున్నారా? ఐతే డేంజర్‌
Late Night Sleep: రాత్రి నిద్ర ఆలస్యం చేస్తున్నారా? ఐతే డేంజర్‌
స్మార్ట్ టీవీ హ్యాక్ అయ్యే అవకాశం ఉందా? ఈ 5 ప్రమాదకరమైన సంకేతాలు
స్మార్ట్ టీవీ హ్యాక్ అయ్యే అవకాశం ఉందా? ఈ 5 ప్రమాదకరమైన సంకేతాలు
ఒరిస్సా తీసుకున్న నిర్ణయంతో భగ్గుమంటున్న కొటియా గ్రామాల ప్రజలు
ఒరిస్సా తీసుకున్న నిర్ణయంతో భగ్గుమంటున్న కొటియా గ్రామాల ప్రజలు
Video: క్రికెట్‌ హిస్టరీలో కొత్త షాట్.. ఏకంగా స్టాండ్ మార్చుకుని
Video: క్రికెట్‌ హిస్టరీలో కొత్త షాట్.. ఏకంగా స్టాండ్ మార్చుకుని
టాటా సుమో మళ్లీ తిరిగి వస్తుందా? నెట్టింట్లో కారు డిజైన్లు!
టాటా సుమో మళ్లీ తిరిగి వస్తుందా? నెట్టింట్లో కారు డిజైన్లు!