AP New Districts: ఏపీలో కొనసాగుతున్న కొత్త జిల్లాల రగడ.. నిరాహార దీక్షకు పూనుకుంటున్న నేతలు
AP New Districts: ఆంధప్రదేశ్(Andhra Pradesh)లో ఓ వైపు ప్రభుత్వం జిల్లాల ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపడుతుంది. తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది(Ugadi) పండగ వేదికగా కొత్త జిల్లాలను అధికారికంగా ఏర్పాటు..
AP New Districts: ఆంధప్రదేశ్(Andhra Pradesh)లో ఓ వైపు ప్రభుత్వం జిల్లాల ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపడుతుంది. తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది(Ugadi) పండగ వేదికగా కొత్త జిల్లాలను అధికారికంగా ఏర్పాటు చేయడానికి అధికారులు చర్యలు మొదలు పెట్టారు. మరోవైపు ఇంకా జిల్లాల పేర్లు, కేంద్రాల విషయంపై వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రకాశం జిల్లాలోని మార్కాపురాన్ని జిల్లా చేయాలని కోరుతూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. మార్కాపురం మండలం గజ్జలకొండ లో మార్కాపురం జిల్లా ఆవశ్యకతను వివరిస్తూ గ్రామస్థులతో ప్రదర్శన నిర్వహించారు.
మార్కాపురం జిల్లా కోసం ఉద్యమాలు ఉదృతంగా జరుగుతున్నా ఈ ప్రభుత్వం, ఈ ప్రాంత నాయకులు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని నారాయణరెడ్డి మండి పడ్డారు. ఇక్కడి ప్రజల జిల్లా ఆకాంక్ష మేరకు అసెంబ్లీలో ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి జిల్లా అయ్యేలా కృషి చేయాలని చెప్పారు. లేని యెడల రాబోవు రోజుల్లో ఈ ప్రాంత ప్రజలు మీకు తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. పశ్చిమ ప్రకాశంలో ప్రతి సంవత్సరం తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని తద్వారా అభివృద్ధి కుంటుపడిందని ప్రత్యేక జిల్లా తో మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక నిధులు రాబట్టి పశ్చిమ ప్రకాశం అభివృద్ధి సాధ్యమవుతుందనిచెప్పారు., వ్యవసాయ రంగం అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి ప్రత్యేక జిల్లాతో మాత్రమే సాధ్యమవుతుందని తెలియజేశారు. ఈ నెల 14 లోపు జిల్లాపై ప్రకటన రాని ఎడల 15 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని కందుల నారాయణరెడ్డి స్పష్టం చేశారు.
Also Read:
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊడ్చేసిన చీపురు.. పార్టీ వేరైనా మళ్లీ ఎక్స్ సర్వీస్‌మెన్‌కే పట్టం
Arasavelli: అరసవెల్లి సూర్యనారాయణ ఆలయంలో ఆవిష్కృతమైన అద్భుతం.. స్వామివారి పాదాలను తాకిన సూర్య కిరణాలు