మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు చురుకుగా ఏర్పాట్లు.. హైకోర్టు ఆదేశాలతో వేగం పెంచిన ఎస్ఈసీ

రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం 12 మునిసిపల్ కార్పొరేషన్లు,75 మున్సిపల్, నగర పంచాయతీలకు మార్చి 10న ఎన్నికలు జరుగనున్నాయి.

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు చురుకుగా ఏర్పాట్లు.. హైకోర్టు ఆదేశాలతో వేగం పెంచిన ఎస్ఈసీ
Follow us

|

Updated on: Mar 02, 2021 | 7:42 PM

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్, నగర పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. గత నెల 15న ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ రెడీ అవుతోంది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి 27 రోజుల సమయాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను పిటిషనర్‌ సవాల్‌ చేయలేదని.. ఈ నేపథ్యంలో ఎన్నికలు ప్రారంభించాలన్న ఎస్‌ఈసీ నిర్ణయాన్ని తప్పుపట్టలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించిందని గుర్తుచేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది.

ఇదిలావుండగా, మున్సిపల్‌తో పాటు నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు మార్చి 9న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే, నామినేషన్ల ఉపసంహరణ దశలో కరోనా విజృంభణతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో మార్చి 15న ఎన్నికలను వాయిదా వేసింది ఎస్ఈసీ. అయితే, నిలిచిపోయిన ఎన్నికలను ఆగిన దగ్గర నుంచే కొనసాగించేందుకు తాజాగా గత నెల 15న నోటిఫికేషన్‌ జారీ చేసింది.

అయితే, ఈ నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన తెలుగు స్టేట్స్‌ కామన్‌ మ్యాన్‌ ఫోరమ్‌ కన్వీనర్‌ జీవీ రావు పిల్‌ దాఖలు చేశారు. కొత్త నోటిఫికేషన్‌ జారీచేయాలని.. కొత్త ఆశావాహులు నామినేషన్‌ వేసేందుకు అవకాశం కల్పించేలా ఎస్‌ఈసీని ఆదేశించాలని కోర్టుకు నివేదించారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది జీవీఎస్‌ మెహర్‌ కుమార్‌ వాదనలు వినిపించారు. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243(కె) మేరకు ఎస్‌ఈసీ ఎన్నికల ప్రక్రియను నిలిపివేసినా, సస్పెండ్‌ చేసినా తిరిగి ఎన్నికల నిర్వహణకు తాజా నోటిఫికేషన్‌ ఇవ్వాలని కోర్టు ద‌ృష్టికి తీసుకువచ్చారు. ఈ ఎన్నికలు వాయిదా పడి 11 నెలలు గడచిన తర్వాత ఇప్పుడు అక్కడి నుంచే ప్రారంభించడం సరికాదని పిటిషన్‌లో పేర్కొన్నారు.

అలాగే, గత 11 నెలల కాలంలో చాలా మంది అభ్యర్థులు, ఓటర్లు ప్రాణాలు కోల్పోయారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత సాధించిన వారు కూడా పెరిగారు. ఎస్‌ఈసీ నిర్ణయంతో అలాంటి వారు పోటీ చేసే అర్హత కోల్పోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రక్రియ సమయాన్ని 27 రోజుల నుంచి 20 రోజులకు తగ్గించారని పిటిషనర్ తరుపు న్యాయవాది వాదించారు. కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తూ ఎస్‌ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించిందని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం తెలియజేశారు.

అయితే, వాయిదాపడిన ఎన్నికలను సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాక పునరుద్ధరిస్తామంటూ ఎస్‌ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను పిటిషనర్లు సవాల్‌ చేయలేదని గుర్తుచేశారు. ప్రభుత్వం ఎస్‌ఈసీతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఎన్నికల ప్రక్రియను పునరుద్ధరిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు కోర్టుకు నివేదించారు. పంచాయతీరాజ్‌ చట్టంలోని ఏడో నిబంధన ప్రకారం ఎన్నికల రద్దు, వాయిదా వేసే విచక్షణాధికారం ఎస్‌ఈసీకి ఉందన్నారు. 2019 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్నారని.. ఆ తదుపరి అర్హత సాధించినవారు పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని కోర్టును ఆశ్రయించలేరని తెలిపారు. ఎస్‌ఈసీ తరఫు అశ్వనీకుమార్‌ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేశాక వ్యాజ్యాలు దాఖలు చేయడానికి వీల్లేదన్నారు. అన్ని పక్షాల వాదనలు ఆలకించిన ధర్మాసనం ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు.ఇంతకుముందు నామినేషన్లను ఉపసంహరించుకున్న 11 మంది అభ్యర్థులకు తిరిగి నామినేషన్లకు ఎస్‌ఇసి అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన ఆ 11 స్థానాలకు తిరిగి ఎంపిక కావడంపై ఇంతకుముందు ఎంపికైన వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. బలవంతంగా వారిచేత నామినేషన్లను ఉపసంహరించినట్లు గుర్తించామని, దీంతో తిరిగి నామినేషన్ అనుమతి ఇస్తున్నట్లు ఎస్ఈసీ పేర్కొన్నారు. దీంతో తిరుపతి కార్పొరేషన్‌లోని ఆరు డివిజన్లు, పుంగనూర్ మున్సిపాలిటీలో మూడు, వైఎస్‌ఆర్ కడప జిల్లా, రాయచోటిలో రెండు మున్సిపాలిట్లో నామినేషన్ల ప్రక్రియ తిరిగి కొనసాగనుంది. ఎస్‌ఇసి నిర్ణయంపై అభ్యర్థులు హైకోర్టులో అప్పీల్ చేస్తామని చెబుతున్నారు.

కాగా, రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం 12 మునిసిపల్ కార్పొరేషన్లు,75 మున్సిపల్, నగర పంచాయతీలకు మార్చి 10న ఎన్నికలు జరుగనున్నాయి. అయితే, తిరిగి ఎన్నికలు అవసరమని భావించిన ప్రదేశాలలో మార్చి 13న ఎన్నికలు జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మార్చి 14న నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ పేర్కొంది.

Read Also…  ముంబైలో నడి రోడ్డుపై బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గన్ కారును అడ్డగించిన రైతు, ఆ తరువాత

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ఈల వేసి.. తొడగొట్టి.. మీసం మెలేసి.. సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే
ఈల వేసి.. తొడగొట్టి.. మీసం మెలేసి.. సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే
ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?
ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
హైదరాబాద్‎లో కూల్ కూల్.. తెలంగాణకు వర్ష సూచన..
హైదరాబాద్‎లో కూల్ కూల్.. తెలంగాణకు వర్ష సూచన..
రైల్వేస్టేషన్‌ బయట అమ్ముతున్న నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా..?
రైల్వేస్టేషన్‌ బయట అమ్ముతున్న నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా..?
ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఉపయోగించే వారికి గూగుల్ గుడ్‌ న్యూస్‌..
ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఉపయోగించే వారికి గూగుల్ గుడ్‌ న్యూస్‌..
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
తెలంగాణలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.. దాఖలుకు సిద్దమైన నేతలు
తెలంగాణలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.. దాఖలుకు సిద్దమైన నేతలు
ధోని రికార్డ్‌నే మడతెట్టేసిన కేఎల్‌ఆర్..
ధోని రికార్డ్‌నే మడతెట్టేసిన కేఎల్‌ఆర్..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..