Watch Video: అహోబిలం నరసింహస్వామి సేవలో మంత్రి రోజా..

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం క్షేత్రాన్ని ఆదివారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సందర్శించారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అహోబిలేశుని పారు వేట మహోత్సవాన్ని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ఇటీవల గుర్తించిన నేపథ్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి, శ్రీ అమృతవల్లి అమ్మవారికి ప్రభుత్వం తరుపున మంత్రి రోజా పట్టు వస్త్రాలను సమర్పించారు.

Watch Video: అహోబిలం నరసింహస్వామి సేవలో మంత్రి రోజా..
Minister Rk Roja
Follow us
J Y Nagi Reddy

| Edited By: Srikar T

Updated on: Mar 10, 2024 | 5:19 PM

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం క్షేత్రాన్ని ఆదివారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సందర్శించారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అహోబిలేశుని పారు వేట మహోత్సవాన్ని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ఇటీవల గుర్తించిన నేపథ్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి, శ్రీ అమృతవల్లి అమ్మవారికి ప్రభుత్వం తరుపున మంత్రి రోజా పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, జల వనరుల శాఖ ప్రభుత్వ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డిలకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆమె శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు నిర్వహించిన అభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రాచీన పుణ్యక్షేత్రమైన అహోబిలం దేవస్థానం అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 25 కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేయడం జరిగిందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. నవనారసింహ క్షేత్రాలతో కూడిన అహోబిలం ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మ వార్లకు ఈరోజు పట్టు వస్త్రాలను సమర్పించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తాను ఈశాఖలో ఉండడం వల్ల తనకు ఈ అదృష్టం దక్కిందన్నారు. తనకు ఈ అదృష్టాన్ని కల్పించిన ముఖ్యమంత్రి జగన్‎కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వీలు చూసుకుని మళ్ళీ వచ్చి అహోబిలం నవనారసింహ క్షేత్రాలను దర్శించుకుంటానని తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..