ఏపీలో పంచాయితీ ఎలక్షన్స్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు.. సంచలనంగా మారుతున్న నిమ్మగడ్డ వరుస లేఖలు..
AP Local Body Elections: ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ రాష్ట్ర సీఎస్‌కు రాస్తున్న వరుస లేఖలు సంచలనంగా మారుతున్నాయి....

AP Local Body Elections: ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ రాష్ట్ర సీఎస్‌కు రాస్తున్న వరుస లేఖలు సంచలనంగా మారుతున్నాయి. తాజాగా సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్‌ను స్థానిక సంస్థల ఎన్నికల విధుల నుంచి తప్పించాలంటూ ఆదేశించారు. అధికారులను సన్నద్ధం చేయడంలో ప్రవీణ్ ప్రకాష్ విఫలమయ్యారని.. అందువల్లే ఎన్నికల షెడ్యూల్ వాయిదా వేయాల్సి వచ్చిందని నిమ్మగడ్డ లేఖలో పేర్కొన్నారు.
కాగా, ఏపీలో తొలి దశ నామినేషన్ల ప్రక్రియ షూరూ అయింది. ఇవాళ్టి నుంచి ఎల్లుండి వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. విజయనగరం మినహా మిగిలిన 12 జిల్లాల్లోనూ ఈ ప్రక్రియ మొదలైంది. తొలి విడతలో 3,249 పంచాయతీలకు, 32,504 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. నామినేషన్ల ఉపసంహరణకు 4వ తేదీ వరకు గడువు ఉంటుంది. ఆ తర్వాత కూడా అభ్యర్థులు పోటీ పడితే 9వ తేదీన ఎన్నిక, కౌంటింగ్ జరుగుతుంది. పార్టీల రహితంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి.
రాష్ట్ర స్థాయిలో పరిణామాలు ఎలా ఉన్నా… పంచాయతీ ఎన్నికలపై లోకల్ ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. పంతాలు, పట్టింపులకు ఈ ఎన్నికలు వేదికగా మారతాయి. గ్రామాల్లో పట్టు నిలుపుకునేందుకు కొందరు, ఈసారైనా పట్టు సాధించాలని ఇంకొందరు ప్రయత్నిస్తారు. మరోవైపు వీలైనన్ని ఎక్కువ ఏకగ్రీవాలకు ప్రయత్నిస్తోంది వైసీపీ. ప్రతిచోటా నామినేషన్ వేయాలని టీడీపీతోపాటు బీజేపీ, జనసేన ప్లాన్ చేశాయి. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయోనన్న టెన్షన్ నెలకొంది.
ఇవి కూడా చదవండి…
హైదరాబాద్ నగర ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. త్వరలోనే రోడ్డెక్కనున్న డబుల్ డెక్కర్ బస్సులు.!
ఏపీ: జూన్ 7 నుంచి ‘పది’ పరీక్షలు.. ప్రాధమిక నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ.. మే 31 వరకు తరగతులు..