Visakha Steel Plant: మేం ప్రైవేటీకరణకు వ్యతిరేకం.. సభలోనే ప్రధాని మోదీకి సీఎం జగన్ ఇదే చెప్పారన్న మంత్రి అమర్నాథ్
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై మాటల యుద్ధం ముదురుతోంది. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మొదటి నుంచి వ్యతిరేకమని, అయినా దుష్ప్రచారం చేయడం దారుణమన్నారు ఏపీ ఐటీ, భారీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్.
వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామంటోంది తెలంగాణ ప్రభుత్వం. రూల్స్‌కు వ్యతిరేకంగా బిడ్డింగ్‌లో ఎలా పాల్గొంటారని ప్రశ్నిస్తోంది ఏపీ సర్కార్. ప్రస్తుతం ఈ అంశంపైనే రెండు తెలుగు ప్రభుత్వాల మధ్య జగడం ముదురుతోంది. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లో భాగంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తరఫున సింగరేణి అధికారులు వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు చేరుకున్నారు. ప్రభుత్వ రంగ సంస్థను కాపాడాలన్నదే తమ అభిమతమని తెలంగాణ మంత్రి KTR సైతం ప్రకటించారు. అయితే ఈ అంశంపై రెండు రోజులుగా తెలంగాణ సర్కార్‌ను నిలదీస్తున్న ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి ప్రశ్నలు సంధించారు. రూల్ బుక్..! ప్రస్తుతం వైజాగ్ స్టీల్‌ప్లాంట్ బిడ్డింగ్‌లో చర్చకు కారణమైన అంశం. ఆ అస్త్రాన్ని కూడా బయటకు తీశారు మంత్రి అమర్నాథ్.
పెట్టుబడుల ఉపసంహరణపై 2002లోనే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. బిడ్డింగ్ నిబంధనలను ఖరారు చేసింది. రెండు దశాబ్దాల కాలంలో పలు సవరణలు కూడా జరిగాయి. పెట్టుబడులు ఉపసంహరించే సంస్థల బిడ్డింగ్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ప్రభుత్వ రంగం సంస్థలు కూడా పాల్గొన కూడదు. కానీ.. ప్రజాప్రయోజనాలు ముడిపడి ఉంటే కొన్ని సడలింపులు ఇచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఆ సడలింపుల్నే తెలంగాణ ప్రభుత్వం ఆధారంగా చేసుకుంది.
మరిన్ని ఆంధ్రపదేశ్ వార్తల కోసం