AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP High Court: హైకోర్టు మెట్టెక్కిన ఆనందయ్య మందు వ్యవహారం.. పూర్తి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర సర్కార్‌కు ఆదేశం

ఆనందయ్య మందుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఆయుర్వేద కౌన్సిల్‌లో ఆయన రిజిస్టర్‌ చేసుకోలేదని ప్రభుత్వం తెలిపింది.

AP High Court: హైకోర్టు మెట్టెక్కిన ఆనందయ్య మందు వ్యవహారం.. పూర్తి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర సర్కార్‌కు ఆదేశం
Ap High Court
Balaraju Goud
|

Updated on: May 27, 2021 | 1:31 PM

Share

AP High Court on Anandaiah Natumadu: ఆనందయ్య మందుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఆయుర్వేద కౌన్సిల్‌లో ఆయన రిజిస్టర్‌ చేసుకోలేదని ప్రభుత్వం తెలిపింది. ఆనందయ్య మందుపై పరిశోధనలు జరుపుతున్నామని చెప్పింది. ఈనెల 29న ల్యాబ్‌ల నుంచి రిపోర్ట్స్‌ వస్తాయని న్యాయస్థానానికి స్పష్టంచేసింది ప్రభుత్వం. దీంతో తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది.

ఇక, ఆనందయ్యతో ప్రైవేట్‌గా మందు తయారు చేయిస్తున్నారన్న దానిపై కోర్టు ఆరా తీసింది. ఆనందయ్య మందును ప్రభుత్వం గుర్తించాలని పిటిషన్ వేశారని ఆనందయ్య తరపు న్యాయవాది అశ్వని కుమార్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ఇదిలావుంటే, తెలుగు రాష్ట్రాల్లో పసరు మేళా నడుస్తోంది. ఆనందయ్య ఎపిసోడ్‌తో చాలా మంది వెలుగులోకి వస్తున్నారు. కరోనా తగ్గుతుందని ప్రజలకు నాటు మందు తినిపిస్తున్నారు. మరోవైపు ఆనందయ్య మందు తిన్న ఓ 72 మంది నెల్లూరు జీజీహెచ్‌లో చేరి కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు.

ఆనందయ్య మందు పని చేయడం లేదంటూ కొందరు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. వైరస్‌ లోడ్‌ ఎక్కువై ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు రిటైర్డ్‌ హెడ్మాస్ట్‌ కోటయ్య అందరికీ తెలుసు. మందు వేసుకున్న రోజు గలగలా మాట్లాడిన రిటైర్డ్‌ హెడ్మాస్టర్… ఆ తర్వాత రోజు కుప్పకూలి ఆసుపత్రి పాలయ్యారు. నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన ఏడుకొండలు, సైదయ్య పరిస్థితి ఇంతే. వీళ్లకు ఆనందయ్య మందు వేసినా వైరస్ తగ్గలేదు. జీజీహెచ్‌లో చికిత్స తీసుకుంటూ సైదయ్య చనిపోయాడు. ఏడుకొండల పరిస్థితి విషమంగా ఉంది.

నెల్లూరు జిల్లా మైపాడువాసి కాంతారావు కేసు ఇలాంటిదే. కంట్లో నాటు మందు వేసినా తగ్గకపోయేసరికి జీజీహెచ్‌లో చేర్పించారు. వీళ్ల పరిస్థితి ఇలా ఉంటే ఆనందయ్యలా చాలా మంది కరోనాకు మందు కనిపెట్టామని ప్రచారం చేసుకుంటున్నారు. కడప జిల్లా పులివెందులలో యదాటి రామగంగాధర్ రెడ్డి యాదవ్, వివేకానందరెడ్డి యాదవ్ పసరు మందు పంచేస్తున్నారు. 9 రకాల ఆకులు, మూలికలతో పసరు తయారు చేసి ప్రజలకిస్తున్నారు. ఫస్ట్‌వేవ్‌లో 3 లక్షల మందికిచ్చామని ఎవరికీ సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేవని చెబుతున్నారు ఈ బ్రదర్స్.

వారి రిక్వస్టులో ఇప్పుడు కూడా మందు తయారు చేస్తున్నట్టు చెప్పారు. పశ్చిమగోదావరిజిల్లా చిట్యాల గ్రామానికి చెందిన నాటువైద్యుడు నందిని సుబ్రహ్మణ్యం కూడా కరోనా పేరుతో మందు ఇస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు పంపిణీ ఆపేయాలని ఆదేశించారు. ఆయన మాత్రం వచ్చిన వాళ్లకు మందు ఇస్తున్నారు. వీళ్లు దారి ఇలా ఉంటే… తెలంగాణలోని మంథనిలో మరో రకమైన వైద్యం నడుస్తోంది. పెద్దపల్లి జిల్లా మంథనిలో రోజూ ఆవు పిడికలు, పసుపు, ఆవు నెయ్యి, ఆవాలు, మెంతులు, లవంగాలు, దాల్చినచెక్క, పచ్చకర్పూరంతో దూపం వేస్తున్నారు. ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్ నుంచి ప్రతి ఇంట్లో పొగా వేస్తున్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆదేశాలతో ఆవు పిడకల పొగా వేస్తున్నామంటున్నారు అనుచరులు.

Read Also….  Diet after Covid Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునే ముందు, తరువాత ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి.. తెలుసుకోండి ఇలా..