AP MPTC ZPTC Polls 2021: ఏపీ ఎస్ఈసీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు యధాతథం..
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఉత్కంఠకు తెరపడింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించుకోవచ్చునని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.
AP MPTC ZPTC Polls 2021: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఉత్కంఠకు తెరపడింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించుకోవచ్చునని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ మేరకు బుధవారం నాడు హైకోర్టు ధర్మాసనం మధ్యాహ్నం తన తీర్పును వెల్లడించిండి. ఎన్నికలు నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం చేసిన అభ్యర్థనకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, కౌంటింగ్ ప్రక్రియను మాత్రం నిలిపివేయాలని షరతు విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకూ ఎన్నికల ఫలితాలను ప్రకటించవద్దని ఎస్ఈసీని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది.
కాగా, గురువారం జరగాల్సిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ రద్దు చేసిన విషయం తెలిసిందే. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా నోటిఫికేషన్ లేదని భావించి ఎన్నికల నిర్వహణను నిలుపుదల చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన 4 వారాల ఎన్నికల కోడ్‌ను అమలు చేసేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించింది. ఈ నేపథ్యంలో పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే, హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. డివిజన్ బెంచ్‌లో అప్పీల్‌కు వెళ్లింది రాష్ట్ర ఎన్నికల సంఘం . గురువారమే పోలింగ్ ఉండటంతో… ఎన్నికలు జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ నెల 1వ తేదీన పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ నీలం సాహ్ని నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లాయి బీజేపీ, టీడీపీ. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రాజ్యాంగ విరుద్ధంగా నిర్వహిస్తున్నారంటూ తెలుగుదేశం నేత వర్ల రామయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లను విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం.. ఎన్నికలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎస్ఈసీ త్రిసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించింది. ఎస్ఈసీ, ఇతరుల వాదనలు విన్న ధర్మాసనం.. ఎన్నికల నిర్వహణకు సంబంధించి స్పష్టమైన తీర్పునిచ్చింది. ఎన్నికలు యధాతథంగా నిర్వహించొచ్చని స్పష్టం చేసింది.
షాకింగ్ ట్విస్ట్..చిన్నప్పుడు తప్పిపోయిన కూతురే కోడలైందా..? వైరల్ వీడియో